AP Tenth and Inter Exams Results 2024 Dates : ఇంటర్, పది ఫలితాల విడుద‌ల‌ తేదీలు ఇవే.. ఈ సారి మాత్రం..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో లోక్‌స‌భ‌, అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో.. ఈ సారి ముందుగా టెన్త్‌, ఇంట‌ర్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విద్యాశాఖ ముందస్తు చర్యలు చేపట్టింది.

విద్యార్థులపై ఎలాంటి రాజకీయ ఒత్తిడి ఉండకూడదన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలను ఈ ఏడాది మార్చి ఒకటో తేదీ నుంచి 30 వరకు నిర్వహించింది.  వెంటనే విద్యాశాఖ అధికారులు మూల్యాంకనం చేపట్టారు. 

ఇప్ప‌టికే ఇంట‌ర్ మొద‌టి, రెండో సంవ‌త్స‌రం ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల పేప‌ర్ మూల్యాంకనం పూరైంది. ఏప్రిల్ 12వ తేదీన ఇంట‌ర్ మొద‌టి, రెండో సంవ‌త్స‌రం ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌ను ఒకేసారి విడుద‌ల చేయ‌నున్నారు. ఇంటర్మీడియట్‌లో రెండు సంవత్సరాల విద్యార్థులు మొత్తం 9,99,698 మంది పరీక్షలు రాశారు. ఏపీ ఇంట‌ర్ మొద‌టి, రెండో సంవ‌త్స‌రం ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల 2024 ఫ‌లితాల‌ను www.sakshieducation.com లో చూడొచ్చు.

చదవండి: Best Courses After Inter: ఇంటర్‌ తర్వాత చదవడానికి అవకాశం ఉన్న టాప్‌ 100 కోర్సులు.. వాటి వివరాలు..

ఏపీ టెన్త్ ఫ‌లితాల ఎప్పుడంటే..?
ఏపీలో పదో తరగతి పరీక్షలను 6,30,633 మంది రాశారు. వీరికి సంబందించిన 47,88,738 జవాబుపత్రాల వేల్యూయేషన్‌ కోసం 25 వేలమంది ఉపాధ్యాయులను నియమించి 26 జిల్లాల్లో సెంటర్లను ఏర్పాటు చేశారు. గతంలో తలెత్తిన ఇబ్బందులను అధిగమించి ఈ ఏడాది మూల్యాంకనం కేంద్రంలో గరిష్టంగా 900 మంది వేల్యూయేటర్లు ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఏప్రిల్‌ ఒ­కటో తేదీన ప్రారంభమైన పదో తరగతి మూల్యాంకనం కూడా దాదాపు పూ­ర్తికానుంది. ఈ ఫ‌లితాల‌ను కూడా ఏప్రిల్ చివ‌రి వారంలో తేదా మే మొద‌టి వారంలో విడుద‌ల చేయ‌నున్నారు.టెన్త్‌ ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల 2024 ఫ‌లితాల‌ను www.sakshieducation.com లో చూడొచ్చు.

#Tags