AP 10th Class 2024: ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉచిత మోడల్ పేపర్లు... మంచి మార్కులు సాధించాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఈ ఏడాది నుంచి ఆరు పేపర్లుగా పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. పేపర్‌–1, పేపర్‌–2 విధానానికి స్వస్తి పలికారు. దీనికి బదులుగా ప్రతి పేపర్‌లోనూ పార్ట్‌–ఎ, పార్ట్‌–బిలు ఉంటాయి. మార్కులు. సెక్షన్‌–సికు 30 మార్కులు.

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షలు ఇంగ్లీష్ లో రెండు మార్కుల ప్రశ్నలు 5(10 మార్కులు); రెండు మార్కుల ప్రశ్నలు 3(6 మార్కులు), ప్యాసేజ్‌ ఆధారిత మరో రెండు మార్కుల ప్రశ్నలు 2(4 మార్కులు) అడుగుతారు. పోస్టర్‌ ఆధారిత ప్రశ్నలు 5(10 మార్కులు). సెక్షన్‌–బికు 40.

AP 10th Class 2024 సోషల్ స్టడీస్ మోడల్ పేపర్స్... ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి... ముఖ్యమైన టాపిక్స్ ఇవే!

ఇంగ్లిష్‌ పేపర్‌లో మంచి మార్కులు పొందేందుకు...

రెండు తెలుగు రాష్ట్రాల్లో 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి వార్షిక పరీక్షలు ఏప్రిల్‌ మూడో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటి నుంచే చక్కటి ప్రణాళికతో చదువు కొనసాగిస్తే.. మంచి మార్కులు సాధించడం కష్టమేమీ కాదు.

  • వెర్బల్, నాన్‌–వెర్బల్‌ అంశాలు బాగా చదవాలి. ఉదాహరణకు లేబుల్స్, బార్‌ డయాగ్రమ్స్, పై చార్ట్స్‌ తదితర అంశాలను అధ్యయనం చేయాలి. 
  • సొంతంగా విశ్లేషించేలా నైపుణ్యం పెంచుకోవాలి. ఇందుకోసం పాత ప్రశ్న పత్రాల సమాధానాలను పరిశీలించడం కూడా మేలు చేస్తుంది.
  • ప్రతి పాఠం చివరలో ఉండే కాంప్రహెన్సివ్‌ ప్రశ్నలపై దృష్టి పెట్టాలి. అదే విధంగా ప్రతి పాఠానికి సంబంధించి సారాంశాన్ని గ్రహించి సొంతగా రాసుకునే అలవాటు చేసుకోవాలి.
  • పోయెట్రీ ప్రశ్నల్లో మంచి మార్కుల సాధన కోసం సదరు పద్యంలో ముఖ్య పదాలు, యాంటానిమ్స్, సినానిమ్స్‌పై దృష్టి సారించాలి.
  • వీటితోపాటు పార్ట్స్‌ ఆఫ్‌ స్పీచ్, డైరెక్ట్, ఇన్‌డైరెక్ట్‌ స్పీచ్, యాక్టివ్‌ వాయిస్, ప్యాసివ్‌ వాయిస్, ఫ్రేజల్‌ వెర్బ్స్‌. ఈ విషయంలో చదవడంతోపాటు ప్రాక్టీస్‌ కూడా చేస్తే మెరుగైన మార్కులు పొందేందుకు మరింత ఆస్కారం లభిస్తుంది.
  • అదే విధంగా అపరిచిత గద్యం(అన్‌ నోన్‌ ప్యాసేజెస్‌) సారాంశాన్ని గ్రహించేలా చదవాలి.
  • లెటర్‌ రైటింగ్‌కు సంబంధించి పంక్చుయేషన్స్, బాడీ ఆఫ్‌ ది లెటర్‌ వంటి అంశాలపై పట్టు ఎంతో అవసరం. 

After 10th Class Best Career Tips: ‘పది’ తర్వాత పదిలమైన కెరీర్‌కు సోపానాలు.. అందుకోండిలా..

AP SSC 10th Class English Model Papers 2024

ఆంధ్ర ప్రదేశ్ కొత్త సిలబస్, ఎక్సమ్ పాటర్న్ కి అనుగుణంగా సబ్జెక్ట్  నిపుణుల సహకారంతో ఏపీ టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ మోడల్ పేపర్స్ సాక్షిఎడ్యుకేషన్ తయారు చేసింది. 

#Tags