AP SSC 10Th Class Results 2023: ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల డేట్ వ‌చ్చేసింది

పదో తరగతి పరీక్షల ఫలితాలను మే రెండో వారంలో విడుదల చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ డి.దేవానందరెడ్డి తెలిపారు.
10th class results

రాష్ట్ర వ్యాప్తంగా 3,349 కేంద్రాల్లో 6.64లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారన్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, ఇప్పటి వరకు ఆరుగురు విద్యార్థులపై మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

చ‌ద‌వండి: Best Polytechnic Courses After 10th: పాలిటెక్నిక్‌ డిప్లొమా.. భవితకు ధీమా

ఏప్రిల్‌ 18తో పరీక్షలు ముగుస్తాయని.. 19 నుంచి 26వ తేదీ వరకు ఎనిమిది రోజుల పాటు రాష్ట్రంలోని 23 జిల్లాల్లో స్పాట్‌ వాల్యుయేషన్ జరుగుతుందని తెలిపారు. ఇందులో 30 నుంచి 35 వేల మంది ఉపాధ్యాయులు పాల్గొంటారని చెప్పారు. వాల్యుయేషన్ అనంతరం మే రెండో వారంలో ఫలితాలు విడుదల చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. 

ఫలితాలు విడుదల అయ్యిన వెంటనే https://results.sakshieducation.comలో చూసుకోవచ్చు

చ‌ద‌వండి:  దేశవ్యాప్తంగా ప్రత్యేక రాష్ట్రాల కోసం జరుగుతున్న ఉద్యమాలు ఇవే!

#Tags