Exam Guidance: చదివిన అంశాలను ఒకసారి రాస్తే చాలు!

సంక్షేమ వసతి గృహాల్లో చదివే నిరుపేద విద్యార్థులు మంచి మార్కులే లక్ష్యంగా కృషి చేసి సత్ఫలితాలు పొందాలి.

చీరాల అర్బన్‌: పదో తరగతిలో ప్రణాళిక ప్రకారం చదివితే మంచి మార్కులు సాధించవచ్చని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రాజ్‌దెబోరా పేర్కొన్నారు. ఆదివారం స్థానిక శ్రీమేధావి కళాశాలలో 10వ తరగతి విద్యార్థులకు ప్రేరణ తరగతులు నిర్వహించారు.

రాజ్‌దెబోరా మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాల్లో చదివే నిరుపేద విద్యార్థులు మంచి మార్కులే లక్ష్యంగా కృషి చేసి సత్ఫలితాలు పొందాలన్నారు. అలసత్వానికి తావు ఇవ్వకుండా చదవాలన్నారు. చదివిన అంశాలను ఒకసారి రాసి చూసుకుంటే గుర్తుండి పోతుందని సూచించారు. ముందుగా బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్య్ర సమరయోధులను స్ఫూర్తిగా తీసుకుని విద్యలో రాణించాలన్నారు.

AP 10th Class and Inter Exams 2024: మార్చిలో పరీక్షలు... తేదీల వివరాలు ఇక్కడ చూడండి

కార్యక్రమంలో విద్యార్థులకు ప్రేరణ తరగతులు సబ్జెక్టుల వారీగా విషయ నిపుణుల చేత సూచనలు, సలహాలు అందించారు. అనంతరం విద్యార్థులకు అభ్యసన సామగ్రి పంపిణీ చేశారు. కార్యక్రమంలో సహాయ సంక్షేమ అధికారి సైదారెడ్డి, సబ్జెక్టు నిపుణులు పవని భానుచంద్రమూర్తి, రాణెమ్మ, ఎల్‌.శ్రీనివాసరావు, సత్యానందం, పాలేటి సురేష్‌, హాస్టల్‌ వార్డెన్లు, చీరాల, పర్చూరు, ఇంకొల్లు ప్రాంతాల హాస్టళ్లలోని విద్యార్థులు పాల్గొన్నారు.

#Tags