Tenth Class Public Exams 2024:పదో తరగతి పరీక్షల మూల్యాంకనాన్ని ఏప్రిల్ 1 నుంచి ప్రారంబం ...
Tenth Class Public Exams 2024:పదో తరగతి పరీక్షల మూల్యాంకనాన్ని ఏప్రిల్ 1 నుంచి ప్రారంబం ...
కర్నూలు : పదో తరగతి పరీక్షలు ఈ నెల 30వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 8వ తేదీ లోపు మూల్యాంకనాన్ని పూర్తి చేయాలని పరీక్షల విభాగం జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు వచ్చాయి. ఏప్రిల్ 6 నుంచి సమ్మేటివ్ అసెస్‌మెంట్–2 పరీక్షలు మొదలుకానుండడంతో మూల్యాంకనానికి సిబ్బంది కొరత రాకుండా సిబ్బందిని ఎంపిక చేస్తున్నారు. ముగ్గురు టీచర్లు ఉన్న చోట ఒకరిని, ఐదుగురు ఉన్న చోట ఇద్దరిని, ఏడుగురు ఉన్న చోట ముగ్గురిని మూల్యాంకన విధులకు ఎంపిక చేస్తున్నారు. మొత్తం 800 మంది సీనియర్ ఉపాధ్యాయులకు మూల్యాంకనానికి హాజరు కావాలని ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఏప్రిల్ మూడో వారంలోనే పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేయాలనే ఆలోచనతో విద్యాశాఖ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.
#Tags