Digital Education: పాఠశాల స్థాయి నుంచే డిజిటల్ విద్య
ప్రభుత్వం డిజిటల్ విద్యకు ప్రాధాన్యం ఇస్తోంది. అంతర్జాతీయ విద్యా ప్రమాణాలను అందుకునేలా 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటోంది.
అందుకనుగుణంగా జిల్లా లోని విద్యార్థులకు 20 వేలకు పైగా స్మార్ట్, ఐఎఫ్‌పీ. ట్యాబ్‌లు అందజేసింది. ప్రస్తుతం 8, 9వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఉన్నాయి. బైజూస్ కంటెంట్‌ను అప్‌లోడ్ చేశాం. ట్యాబ్‌ల కెపాసీటిని పెంచి ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న ఫ్యూర్ స్కిల్స్ ఎక్స్‌పర్ట్స్‌గా వారిని జిల్లాలో 75 పాఠశాలల్లో 25 మందిని ఎంపిక చేశాం. ప్రతి విద్యార్ధి అన్ని పాఠశాలలకు పంపి విద్యార్ధులకు మోటివేట్ చేస్తున్నాం. సాంకేతిక సమస్యల కోసం సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్‌ను నియమించారు.
– రామారావు, డీఈఓ
#Tags