SSC Pre Final: రేపటి నుంచి పదో తరగతి ప్రీ ఫైనల్‌ పరీక్షలు

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మార్చి 18వ తేదీ నుంచి ఆరంభం కానున్నాయి.

దీనికి విద్యార్థులను సన్నద్ధం చేయడంలో భాగంగా ప్రీ ఫైనల్‌ పరీక్షలను ఫిబ్ర‌వ‌రి 23వ తేదీ నుంచి నిర్వహించేందుకు పార్వతీపురం మన్యం జిల్లా విద్యాశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే టెన్త్‌ సిలబస్‌ పూర్తికావడంతో పాఠ్యాంశాలను పునఃశ్చరణ చేస్తున్నారు. ప్రత్యేక తరగతులు నిర్వహించి రోజువారీ, వారాంతపు పరీక్షలు నిర్వహిస్తున్నారు. శతశాతం ఫలితాల సాధనే లక్ష్యంగా ఉపాధ్యాయులు బోధన సాగిస్తున్నారు. 
ప్రీఫైనల్‌ పరీక్షల వల్ల విద్యార్థుల్లో భయం పోతుందని, పరీక్షలు రాయడంపై స్పష్టమైన అవగాహన వస్తుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఏ సబ్జెక్టుల్లో వెనుకబడి ఉన్నామన్న విషయం విద్యార్థులకు అవగతమవుతుందన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన 11,535 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. 1–9వ తరగతి విద్యార్ధులకు ఎఫ్‌ఏ–4 పరీక్షలు  ఫిబ్ర‌వ‌రి 23వ తేదీ నుంచి జరగనున్నాయి.

మనో ధైర్యం వస్తుంది..
ప్రీ ఫైనల్‌ పరీక్షలు రాయడం వల్ల పబ్లిక్‌ పరీక్షలకు విద్యార్థుల్లో మనో ధైర్యం పెరుగుతుంది. అన్ని విద్యాశాఖ కార్యాలయాల్లో టెన్త్‌ ప్రీ ఫైనల్‌ పశ్నపత్రాలు సిద్ధంగా ఉన్నాయి. ఏ రోజు పరీక్షకు సంబంధించి ఆ పాఠశాలల సిబ్బంది వచ్చి ప్రశ్న పత్రాలను తీసుకెళ్లాలి. ఫిబ్ర‌వ‌రి 23 నుంచి మధ్యాహ్నం 1.15 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తాం. – జి.పగడాలమ్మ, డీఈఓ, పార్వతీపురం మన్యం

 

Admissions in APTWREIS: ఏపీ గిరిజన సంక్షేమ గురుకులాల్లో ప్రవేశాలు.. ఉచిత విద్య, జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ

#Tags