AP SSC 10th Results 2024: పదో తరగతి ఫలితాల్లో బాలికలదే పైచేయి, ఆ స్కూళ్లల్లో వందశాతం ఉత్తీర్ణత

ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి ఫలితాల్లో ఓవరాల్‌గా 86.69 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలికలు 89.17% ఉత్తీర్ణతతో పైచేయి సాధించారు. బాలురు 84.21 శాతంతో ఉత్తీర్ణులయ్యారు. 2300 స్కూళ్లలో వంద శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, 17 స్కూళ్లలో సున్నా ఉత్తీర్ణత నమోదైంది.

69.26శాతం మంది విద్యార్థులు ఫస్ట్‌ క్లాస్‌లోనే పాసయ్యారు. 96.37 శాతం అత్యధిక ఉత్తీర్ణతతో పార్వతీపురం మన్యం జిల్లా అగ్రస్థానాన్ని దక్కించుకోగా, 62.47 శాతం కర్నూల్‌ జిల్లా చిట్టచివరి స్థానంలో నిలిచింది.

► AP 10th Class Supplementary Exam Dates: టెన్త్‌ ఫలితాల్లో ఫెయిలైన వారికి మరో ఛాన్స్‌.. సప్లిమెంటరీ పరీక్షల తేదీలు విడుదల

 

ఇదిలా ఈ ఏడాది దాదాపు 7 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు విద్యాశాఖ కమిషనర్‌ తెలిపారు. వీరిలో రెగ్యులర్‌ విద్యార్థులు 6.23 లక్షలు కాగా, గత ఏడాది ఫెయిల్‌ అయిన విద్యార్థులు లక్షకుపైగా ఉన్నారు. మార్చి 18 నుంచి 30 వరకు ఏపీలో పదో తరగతి పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,473 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించారు.

#Tags