Telangana High Court : తెలంగాణ హైకోర్టు ఒప్పంద ప్రాతిపదికన లా క్లర్క్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు

హైదరాబాద్‌లోని తెలంగాణ హైకోర్టు ఒప్పంద ప్రాతిపదికన లా క్లర్క్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులు తెలంగాణ హై­కోర్టు తెలంగాణ స్టేట్‌ జ్యుడిషియల్‌ అకాడమీ, సికింద్రాబాద్‌లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 33.
»    పోస్టుల వివరాలు: తెలంగాణ హైకోర్టు–31, తెలంగాణ స్టేట్‌ జ్యుడిషియల్‌ అకాడమి, సికింద్రాబాద్‌లో–02.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ(లా) ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం, పని అనుభవం ఉండాలి.
»    వయసు: 30 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

»    దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది రిజిస్ట్రార్‌ జనరల్, తెలంగాణ హైకోర్టు, హైదరాబాద్‌ చిరునామకు పంపించాలి.
»    దరఖాస్తులకు చివరితేది: 23.11.2024.
»    వెబ్‌సైట్‌: https://tshc.gov.in

Telangana Group 3 Exam Schedule: బ్రేకింగ్ న్యూస్‌... గ్రూప్-3 పరీక్షల షెడ్యూల్ విడుదల

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags