TSPSC AEE Results 2023 : 1540 ఏఈఈ పోస్టుల‌కు సంబంధించిన‌ ఫ‌లితాలు విడుద‌ల‌.. మొత్తం ఎంత‌మంది సెల‌క్ట్ అయ్యారంటే..

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నిర్వ‌హించిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) ప‌రీక్ష ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు.
TSPSC AEE Results 2023

ఏఈఈ ప‌రీక్ష‌ను మే నెల‌లో నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే. 1,540 ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్ పోస్టులకు ఈ నోటిఫికేషన్ ఇచ్చిన విష‌యం తెల్సిందే.
ఈ ఏఈఈ ప‌రీక్ష‌కు సంబంధించిన‌ ఇప్పటికే తుది కీ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా సబ్జెక్టుల వారీగా మెరిట్ జాబితా వెల్లడైంది. 1:2 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపిక చేశారు. అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ – 857, సివిల్ ఇంజనీరింగ్ – 27,145, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ – 10,948, మెకానికల్ ఇంజనీరింగ్ – 7,726 మంది చొప్పున మెరిట్ జాబితా విడుదల చేశారు.

☛ 1540 ఏఈఈ పోస్టుల ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి

మొత్తం 450 మార్కులకు రాత పరీక్ష నిర్వహించారు. పేపర్-1 (జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్) 150 మార్కులు, పేపర్-2 (అభ్యర్థి సబ్జెక్ట్) 300 మార్కులు. పేపర్-1లో 150 మార్కులకు 150 ప్రశ్నలు, పేపర్-2లో 300 మార్కులకు 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 150 నిమిషాల పరీక్ష సమయం కేటాయించారు.

చదవండి: టీఎస్‌పీఎస్సీ Group 1&2&3&4 : స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

#Tags