AP ECET 2024 Rankers: ఏపీ ఈసెట్‌–2024 ప‌రీక్ష‌లో ఉత్త‌మ ర్యాంకులు సాధించి ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన విద్యార్థులు..

పాలిటెక్నిక్‌ విద్యార్థులు ఏపీ ఈసెట్‌లో స్టేట్‌ టాపర్లగా నిలిచి ఘ‌న విజ‌యం సాధించారు..

గుడ్లవల్లేరు: ఏపీ ఈసెట్‌–2024లో కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు ఏఏఎన్‌ఎం అండ్‌ వీవీఆర్‌ఎస్‌ఆర్‌ పాలిటెక్నిక్‌ విద్యార్థులు స్టేట్‌ టాపర్లగా నిలిచి విజయ ఢంకా మోగించారు. ఈ విషయాన్ని ఆ కాలేజీ ప్రిన్సిపాల్‌ ఎన్‌.రాజశేఖర్‌ గురువారం విలేకరులకు తెలిపారు. పాలిటెక్నిక్‌ విద్యార్థులు ఇంజినీరింగ్‌లో చేరేందుకు నిర్వహించే అర్హత పరీక్ష ఈ–సెట్‌ ఫలితాలు గురువారం ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో పది లోపు 13, వంద లోపు 62 ర్యాంకులు తమ విద్యార్థులు సాధించారన్నారు.

Hotel Management Courses: హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు.. అర్హులు వీరే..!

అప్లయిడ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌(ఏఈఐ) విభాగంలో 1, 2, 3, 4, 5, 6, 9, 10వ ర్యాంకులు, సివిల్‌లో ఎనిమిదో ర్యాంకు, కంప్యూటర్‌ సైన్స్‌లో 1, 3, 5, 8వ ర్యాంకులు సాధించినట్లు చెప్పారు. సీఎంఈలో స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకర్‌గా మామిడి తుహి, ఏఈఐలో స్టేట్‌ టాపర్‌గా వెంకటసాయి, ఏఈఐలోనే స్టేట్‌ సెకండ్‌ ర్యాంకును నాగ గోపాల్‌ సాధించాడన్నారు. విద్యార్థులతో పాటు శిక్షణ ఇచ్చిన అధ్యాపకులను కాలేజీ చైర్మన్‌ డాక్టర్‌ వల్లూరుపల్లి నాగేశ్వరరావు, కార్యదర్శి వల్లూరుపల్లి సత్యనారాయణ, సహ కార్యదర్శి వల్లూరుపల్లి రామకృష్ణ అభినందించారు.

Indian Grand Prix-2 Athletics Meet: ఇండియన్‌ గ్రాండ్‌ప్రి–2 అథ్లెటిక్స్‌ మీట్‌లో శ్రీనివాస్‌కు స్వర్ణం.. శిరీషకు కాంస్యం

సాయిమేధ విద్యార్థుల ప్రతిభ

ఏపీ ఈసెట్‌ 2024 ఫలితాలు గురువారం విడుదల కాగా, విజయవాడలోని సాయిమేధ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు ఆ సంస్థ డైరెక్టర్‌ జి. రమణ, ఇన్‌చార్జి మజ్జిగ బాలకృష్ణ తెలిపారు. తమ విద్యార్థి బి. హేమనాథ్‌రెడ్డి ఈసీఈలో ఫస్ట్‌ ర్యాంకు సాధించగా, బి. ధర్మేంధ్ర (డీఎంఈ), కె వేణుగోపాల్‌(ఈఈఈ)లో 4వ ర్యాంకు సాధించినట్లు తెలిపారు. వారితో పాటు సి. వెంకట గణేష్‌(ఈసీఈ) 6వర్యాంకు, ఎస్‌ షణ్ముఖ శర్మ(ఈసీఈ)7వ ర్యాంకు, బి ఈశ్వర్‌సాయి రాజా(సివిల్‌)8వ ర్యాంకు సాధించినట్లు తెలిపారు.

Strictness in Evaluation: ప‌దో త‌ర‌గ‌తి మూల్యాంక‌నం స‌మ‌యంలో టీచ‌ర్లు జాగ్ర‌త్తగా ఉండాల్సిందే.. లేకుంటే..!

#Tags