Degree Final Year Results: ఆర్ట్స్ క‌ళాశాల‌లో డిగ్రీ ఫైన‌ల్ ఇయ‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌..!

డిగ్రీ సెమిస్ట‌ర్ ఫ‌లితాల‌ను రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శోభా రాణి విడుద‌ల చేశారు. అనంత‌రం, క‌ళాశాల సాధించిన ఉత్తీర్ణ‌త గురించి వివ‌రించారు..

కంబాలచెరువు: ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌లో 90.7 శాతం ఫలితాలు సాధించిందని ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రామచంద్ర ఆర్‌కే తెలిపారు. జోన్‌ 1, 2 రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శోభా రాణి ఈ ఫలితాలను గురువారం విడుదల చేశారన్నారు. బీఏ, బీకాం, బీఎస్సీ గ్రూపులకు సంబంధించి 753 మంది విద్యార్థులకు 683 మంది పాస్‌ అయ్యారని తెలిపారు. రాబోయే విద్యా సంవత్సరంలో ప్రారంభించనున్న సర్టిఫికెట్‌ కోర్సులను డాక్టర్‌ శోభారాణి సమీక్షించారన్నారు.

KGBV Inter Admissions: కేజీబీవీల్లో ఇంటర్‌ ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు..

బీఏ టూరిజం హాస్పిటాలిటీ, బీఎస్సీ ఇండస్ట్రియల్‌ మ్యాథమెటిక్స్‌తో కూడిన కొత్త డిగ్రీ ప్రోగ్రామ్‌లు, ఇంటర్న్‌షిప్‌ల్లో సమగ్రత సాధించడంపై చర్చించామన్నారు. అకడమిక్‌ సమన్వయకర్త డాక్టర్‌ డి.సంజీవ్‌కుమార్‌, ఐక్యూఏసీ సమన్వయకర్త డాక్టర్‌ ఎ.అన్నపూర్ణ, పరీక్షల నియంత్రణాధికారి పి.బాబ్జీ, అసిస్టెంట్‌ ప్రిన్సిపాల్‌ గోకవరపు చంద్రశేఖర్‌, ఏఆర్‌సీ కోఆర్డినేటర్‌ సీహెచ్‌.సంజీవ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

DEO Exams: 25వ తేదీన డీఈఓ ప‌రీక్ష‌లు..

#Tags