Telangana WDCW Department : ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు.. చివరి తేదీ ఇదే..

పుట్టపర్తి అర్బన్‌: జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ కార్యాలయంలో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐసీడీఎస్‌ పీడీ లక్ష్మీకుమారి ఓ ప్రకటనలో తెలిపారు.
మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ

జిల్లా కోఆర్డినేటర్‌, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, హిందూపురం, మడకశిర, ఓడీ చెరువులో బ్లాక్‌ కోఆర్డినేటర్‌ మొత్తం 5 ఖాళీలు ఉన్నాయన్నారు. ఈనెల 19 నుంచి 26 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులు అందజేయాలన్నారు. అభ్యర్థుల వయస్సు 2023 జూలై 1వ తేదీ నాటికి 25 సంవత్సరాల నుంచి 42 లోపు ఉండాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు సడలింపు ఉంటుందన్నారు. కాంట్రాక్టు కాల పరిమితి ఒక ఏడాది ఉంటుందన్నారు. జిల్లా ప్రాజెక్టు కోఆర్డినేటర్‌కు రూ.30 వేలు, బ్లాక్‌ కోఆర్డినేటర్‌కు రూ.20 వేలు జీతం ఉంటుందని చెప్పారు.

Also read: Free training: ఐటీ, టూరిజం, హాస్పిటాలిటీలో ఉచిత శిక్షణ

కంప్యూటర్‌ సైన్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో డిగ్రీ లేదా డిప్లొమా కలిగి ఉండాలన్నారు. అప్లికేషన్‌ మెయింటెనెన్స్‌లో రెండేళ్ల అనుభవంతో పాటు తెలుగు చదవడం, రాయడం, కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలన్నారు. జిల్లా ప్రాజెక్టు అసిస్టెంట్‌ ఉద్యోగానికి రూ.18 వేలు జీతం ఉంటుందని చెప్పారు. మేనేజ్‌మెంట్‌, సోషల్‌ సైన్స్‌అండ్‌ న్యూట్రిషన్‌లో డిగ్రీ ,పీజీ, డిప్లొమా కలిగి ఉండాలన్నారు. టీం సభ్యులకు శిక్షణ ఇవ్వడం, పర్యవేక్షణ అనుభవం రెండు సంవత్సరాలు ఉండాలని పేర్కొన్నారు. గెజిటెడ్‌ అధికారితో అటెస్టు చేసిన జిరాక్స్‌ సర్టిఫికెట్లతో కూడిన దరఖాస్తులను జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ అధికారి, పుట్టపర్తి, శ్రీసత్యసాయి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఎదురుగా ఉన్న కార్యాలయంలో అందజేయాలని సూచించారు.

Also read: APPSC Exams 2023: పోటీ పరీక్షల నిర్వహణకు పక్కా ఏర్పాట్లు.. August 19 నుంచి యూపీఎస్సీ పరీక్షలు..

#Tags