Kendriya Vidyalaya Jobs: కేంద్రీయ విద్యాలయాల్లో ఉద్యోగాలకు రాత పరీక్ష లేదు... డైరెక్ట్‌ జాబ్‌ ఇలా

Kendriya Vidyalaya Jobs

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు అర్హులైన వారు అప్లికేషన్ నింపి ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఒక సెట్ సెల్ఫ్ అట్టేస్టెడ్ జిరాక్స్ కాఫీలు మరియు ఒక పాస్పోర్ట్ సైజు ఫోటోతో ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఈ ఉద్యోగాలను పార్ట్ టైం లేదా కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నారు..

ఈ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే స్వయంగా సెప్టెంబర్ 18వ తేదీన జరిగే ఇంటర్వ్యూకు హాజరవ్వండి.

అంగన్‌వాడీలో భారీగా ఉద్యోగాలు..10వ తరగతి అర్హతతో: Click Here

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ: ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ హైదరాబాద్ లో ఉప్పల్ లో ఉన్న పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ నుండి టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

భర్తీ చేస్తున్న పోస్టులు: టీజీటీ (ఇంగ్లీష్) , టీజీటీ (సోషల్ సైన్స్) , టీజీటీ (మ్యాథమెటిక్స్) మరియు ఎడ్యుకేషన్ కౌన్సిలర్ అనే పోస్టులు భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

అర్హతలు: నోటిఫికేషన్ లో క్రింద పేర్కొన్న విధంగా అర్హతలు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.

అప్లికేషన్ ఫీజు: ఇంటర్వ్యూకు హాజరు కావడానికి ఎటువంటి ఫీజు లేదు.

ఇంటర్వ్యూ తేదీ: 18-09-2024 తేదీన ఉదయం 9 నుండి 10 గంటల మధ్య ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

అప్లికేషన్ విధానం: అర్హత ఉన్న అభ్యర్థులు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. 

ఎంపిక విధానం: ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులను ఇంటర్వ్యూ మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.

#Tags