Anganwadi Free Kits news: గుడ్‌న్యూస్‌ ఇకపై అంగన్‌వాడీలో ఈ కిట్లు ఉచితం

Anganwadi Free Kits

సాక్షి, హైదరాబాద్‌: అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల సంఖ్యను పెంచేందుకు ‘అమ్మ మాట–అంగన్‌వాడీ బాట’నినాదంతో వారం రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలని పంచాయతీరాజ్‌ గ్రామీ ణ అభివృద్ధి, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. సచివాలయంలో బుధవారం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులతో అంగన్‌వాడీ కేంద్రాలు, మహిళా భద్రత, దత్తత, చైల్డ్‌ కేర్‌ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.

Anganwadi Jobs: Good News.. అంగన్‌వాడీ ఉద్యోగాల నోటిఫికేషన్‌ విడుదల..

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల్లో నర్సరీ తరగతులను బోధించనున్నట్లు వెల్లడించారు. 

ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ము ఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డిని ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాలకు పంపి ణీ చేస్తున్న సరుకులు, సేవల నాణ్యతను పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నా రు.

కొన్ని కేంద్రాలకు నాసిరకం కోడిగుడ్లు, పాల ప్యాకెట్లు సరఫరా అయిన నేపథ్యంలో.. వాటి కట్టడి కోసం జిల్లాస్థాయి క్షేత్రస్థాయి అధికారులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. నాసిరకం సరుకులు సరఫరా అయితే అంగన్‌వాడీ టీచర్లు తిరస్కరించాలని సూచించారు.

సరుకుల నాణ్యతను పరిశీలించేందుకు ఫ్లయింగ్‌ స్క్వాడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు కేంద్రాలను సందర్శించి తనిఖీ చేసి నివేదిక సమరి్పంచాలని మంత్రి ఆదేశించారు. అంగన్‌వాడీలోని చిన్నారులకు త్వరలో యూనిఫాంలు అందజేస్తామని తెలిపారు.

దేశంలోనే తొలిసారిగా అంగన్‌వాడీ చిన్నారులకు యూనిఫాంలు ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సాధిస్తుందన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు పెయింటింగ్‌ పనులు పూర్తి చేయాలని సూచించారు.

మహిళలు చిన్నారులపై దాడులు, అఘాయిత్యాలు జరిగితే తక్షణమే స్పందించేలా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. యునిసెఫ్‌ సౌజన్యంతో రూపొందించిన న్యూట్రీషియన్‌ చాంపియన్‌ పుస్తకాన్ని, న్యూట్రీషియన్‌ కిట్లను మంత్రి సీతక్క ఈ సందర్భంగా ఆవిష్కరించారు. సమీక్షలో రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణ, కమిషనర్‌ కాంతి వెస్లీ తదితరులు పాల్గొన్నారు.

#Tags