Job Mela: SV డిగ్రీ కళాశాలలో జాబ్‌ మేళా

Job Mela news

పార్వతీపురంటౌన్‌: జిల్లాకేంద్రం పార్వతీపురం పట్టణంలోని ఎస్‌వీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలో ఈనెల 10న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డా.సీహెచ్‌ చలపతిరావు తెలిపారు.

ఈ మేరకు కళాశాలలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఈ జాబ్‌మేళాలో నిట్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, డెక్కన్‌ కెమికల్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఫాక్స్‌కాన్‌, ఆల్‌స్టామ్‌, డైకి అల్యూమినియం ఇండస్ట్రీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, డిక్సాన్‌, హ్యుండాయ్‌ మోబీస్‌ అండ్‌ రాక్‌మెన్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు.


Apollo Pharmacy jobs: అపోలో ఫార్మసీలో ఉద్యోగాలు..

రిలేషన్‌షిప్‌ మేనేజర్‌ ట్రైనీ, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ టెక్నిషియన్‌, క్వాలిటీ, ప్రొడక్షన్‌ అండ్‌ మెయిన్‌టనెన్స్‌ విభాగాల్లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని, ఎస్‌ఎస్‌సి, ఇంటర్మీడియట్‌, ఐటీఐ, డిప్లమో, ఏదైనా డిగ్రీ, బీటెక్‌ ఉత్తీర్ణులైన 35 సంవత్సరాలోపు అభ్యర్థులు అర్హులని స్పష్టం చేశారు.

ఎంపికై న వారికి నెలకు రూ. 12వేల నుంచి రూ.25వేల వరకు జీతం, ఇన్సెంటివ్‌, భోజనం, వసతి, రవాణా సౌకర్యం ఆయా ఉద్యోగాలను బట్టి ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 10వ తేదీ బుధవారం ఎస్‌వీ గవర్నమెంట్‌ డిగ్రీ కళాశాలలో ఉదయం 9 గంటలకు సర్టిఫికెట్స్‌, జిరాక్స్‌లతో హాజరు కావాలని సూచించారు.

#Tags