Telangana High Court and District Courts 1673 jobs: 10వ తరగతి , Inter అర్హతతో తెలంగాణ హైకోర్టు మరియు జిల్లా కోర్టులలో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ విడుదల
తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు తెలంగాణ హైకోర్టు నుండి కొత్త సంవత్సరంలో శుభవార్త వచ్చింది. తెలంగాణ హైకోర్టులో మరియు జిల్లా కోర్టులలో 1673 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తెలంగాణ హైకోర్టు నుండి జాబ్ క్యాలెండర్ విడుదల కావడం జరిగింది. ఈ జాబ్ క్యాలెండర్ విడుదల సమయంలోనే 1673 ఉద్యోగాలు భర్తీ కోసం మొత్తం 17 నోటిఫికేషన్స్ కూడా విడుదల చేయడం జరిగింది.
ఈ నోటిఫికేషన్స్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. 7వ తరగతి 10వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ మరియు ఇతర విద్యార్హతలు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులే.
పోస్టుల పేర్లు: ఈ నోటిఫికేషన్ల ద్వారా టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ విభాగాల్లో ఉండే అన్ని రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
మొత్తం పోస్టుల సంఖ్య :
నోటిఫికేషన్ ద్వారా 1673 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇందులో
నాన్ టెక్నికల్ ఉద్యోగాలు – 1277
టెక్నికల్ ఉద్యోగాలు – 184
హైకోర్ట్ లలో ఉద్యోగాలు – 212
అర్హతలు: 7వ తరగతి , 10వ తరగతి , ఇంటర్మీడియట్, డిగ్రీ వంటి వివిధ రకాల అర్హతలు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు
వయస్సు: కనీసం 18 సంవత్సరాలు నుండి 34 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి అర్హులు.
వయసులో సడలింపు :
ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయసులో ఐదు సంవత్సరాలు సడలింపు ఇస్తారు.
PwBD అభ్యర్థులకు వయసులో 10 సంవత్సరాలు సడలింపు ఇస్తారు..
నోటిఫికేషన్ విడుదల తేది: ఈ 17 రకాల నోటిఫికేషన్స్ 2-01-2025 తేదిన విడుదల చేశారు.
అప్లికేషన్ ప్రారంభ తేది: 02-01-2025 నుండి ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.
చివరి తేదీ: ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ 31-01-2025
పరీక్ష తేదీలు:
జిల్లా కోర్టులో ఉండే నాన్ టెక్నికల్ ఉద్యోగాలు మరియు హైకోర్టులో ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు ఏప్రిల్ 2025 లో నిర్వహిస్తారు.
జిల్లా కోర్టుల్లో టెక్నికల్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు జూన్ 2025 లో నిర్వహిస్తారు.
అప్లై చేయు విధానం: అర్హత ఉండే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు..
ఎంపిక విధానం:
నాన్ టెక్నికల్ ఉద్యోగాలకు రాత పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.
టెక్నికల్ ఉద్యోగాలకు రాత పరీక్షతో పాటు స్కిల్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి తుది ఎంపిక చేస్తారు.
Note: పూర్తి నోటిఫికేషన్ మరియు Online Applications కోసం క్రింద ఇచ్చిన లింక్స్ పైన క్లిక్ చేసి వివరాలు అప్లై చేయండి.