Anganwadi Latest news: అంగన్‌వాడీ కేంద్రాల తనిఖీ లేటెస్ట్ న్యూస్
ఖానాపూర్: పట్టణంలోని విద్యానగర్–1 అంగన్‌వాడీ కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణపై కలెక్టర్‌కు ఫిర్యాదులు అందడంతో ఆకస్మిక తనిఖీలు చేయాలని ఆదేశించారు.
Telangana Anganwadi 11000 jobs Notification: Click Here
ఈమేరకు అదనపు కలెక్టర్ విద్యానగర్–1 కేంద్రాన్ని తనిఖీ చేశారు. చిన్నారుల హాజరు, గైర్హాజరు, పోషకాహారం పంపిణీ వంటి విషయాలను పరిశీలించారు. రికార్డులు తనిఖీ చేశారు. 300 కోడి గుడ్లు తేడా ఉన్నట్లు గుర్తించారు. లబ్ధిదారులకు సరుకులను సక్రమంగా ఇవ్వకపోవడం, రికార్డుల్లో తప్పుగా నమోదు చేసినట్లు ధ్రువీకరించారు.
ఈ విషయమై టీచర్‌కు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని సీడీపీవో సరితను ఆదేశించారు. రికార్డుల్లో టీచర్‌కు మెమో జారీ చేసినట్లు ఉండడంతో ఈ విషయమై సీడీపీవోను అడిగి తెలుసుకున్నారు. సరుకుల్లో తేడా ఉండడంతో గతంలో మెమో జారీ చేసినట్లు సీడీపీవో అదనపు కలెక్టర్‌కు తెలిపారు. అంతకుముందు అంగన్‌వాడీ కేంద్రంలోని మెనూ చార్ట్‌ను పరిశీలించారు.
చిన్నారుల కోసం తయారు చేసిన అన్నం, పప్పును రుచి చూశారు. తనిఖీలు నిరంతరం కొనసాగేలా సీడీపీవో, సూపర్‌వైజర్లను ఆదేశిస్తామన్నారు. జర్నలిస్టులు సైతం సామాజిక బాద్యతగా కేంద్రాలను తనిఖీ చేయాలని సూచించా రు. అనంతరం పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న ఓ ఇంటిని పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చిన్నం సత్యం, వైస్‌చైర్మన్ కావలి సంతోష్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.