TCS Salary Hike: టీసీఎస్‌ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. విరికి ఇంక్రిమెంట్‌ రెండంకెల పెంపుదల..

దేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగులకు జీతాలు పెంచింది. 4.5 నుంచి 7 శాతం శ్రేణిలో వార్షిక ఇంక్రిమెంట్‌లను ప్రకటించింది. టాప్ పెర్ఫార్మర్‌లకు రెండంకెల పెంపుదల ఉంటుందని చీఫ్ హెచ్‌ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ తెలిపారు. ఈ వేతనాల పెంపు ఏప్రిల్ 1 నుంచి అమలు కానుందని చెప్పారు.

"క్యాంపస్ నియామకాలు, పెరిగిన కస్టమర్ విజిట్‌ల ఫలితంగా అట్రిషన్ 12.5 శాతానికి తగ్గింది. ఉద్యోగులు కార్యాలయానికి తిరిగి రావడం మా డెలివరీ సెంటర్‌లలో గొప్ప చైతన్యాన్ని కలిగించింది. మా సహచరుల ఉత్సాహాన్ని పెంచింది" అని టీసీఎస్‌ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ ఓ  ప్రకటనలో పేర్కొన్నారు.

చదవండి: Tech Jobs: ఐటీ జాబ్‌ కోసం వేచిచూస్తున్న వారికి శుభవార్త.. పుంజుకోనున్న నియామకాలు!!

గత ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్‌ కొంత మంది పర్ఫార్మర్లకు 12-15 శాతం వరకు జీతాలను పెంచి ప్రమోషన్స్‌ సైకిల్‌ను ప్రారంభించింది. ఈ పెంపుదల 2023 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చింది.

ఫలితాలను ప్రకటించిన తర్వాత లక్కాడ్ మీడియాతో మాట్లాడుతూ, 2023-24లో కంపెనీ చాలా మంది ఫ్రెషర్‌లను ఆన్‌బోర్డ్ చేసిందని, అయితే, ఇంకా కొంతమందిని చేర్చుకోవాల్సి ఉందని అన్నారు. ఈ మిగిలిన ఫ్రెషర్లను ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో చేర్చుకుంటామని ఆయన తెలిపారు.

చదవండి: AI skills: ఏఐ స్కిల్స్‌లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు ట్రైనింగ్.. ఎక్క‌డంటే..

కాగా 2024 ఆర్థిక సంవత్సరంలో 40,000 మంది ఫ్రెషర్‌లను చేర్చుకోవాలని యోచిస్తున్నట్లు గతంలో టీసీఎస్ తెలిపింది. అయితే, బడ్జెట్ పరిమితుల కారణంగా ఫ్రెషర్లు, ఇతర నియామకాల ఆన్‌బోర్డింగ్‌ను ఆలస్యం చేస్తోంది.

#Tags