డీఎస్సీ ఎంటీఎస్‌ టీచర్ల సర్వీస్‌ రెన్యూవల్‌

DSC MTS Teachers

రాప్తాడురూరల్‌: 98– డీఎస్సీ ఎంటీఎస్‌ పద్ధతిలో పని చేస్తున్న ఎస్జీటీల సర్వీస్‌ను 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి రెన్యూవల్‌ చేశారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ప్రకాష్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మినిమం టైం స్కేల్‌ (ఎంటీఎస్‌) కింద రాష్ట్ర వ్యాప్తంగా 4,534 మంది ఎస్జీటీలుగా పని చేస్తుండగా.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 485 మంది పని చేస్తున్నారు. 2023–24 విద్యా సంవత్సరంలో వీరు జూన్‌ 1 నుంచి 2024 ఏప్రిల్‌ 30 వరకు పని చేయనున్నారు. మే నెలలో ‘నోవర్క్‌–నోపే’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా రెన్యూవల్‌ ఉత్తర్వులు రాని కారణంగా ఈ విద్యా సంవత్సరం వీరికి ఇంకా జీతాలు పెట్టలేదు. రెన్యూవల్‌ ఉత్తర్వులు అందడంతో జీతాల విడుదలకు మార్గం సుగమమైంది. ఉత్తర్వులు విడుదల చేయడం పట్ల ఎంటీఎస్‌ టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

#Tags