Mega job mela: 25న మెగాజాబ్‌ మేళా

mega job mela

నిర్మల్‌ఖిల్లా: అఖిల భారత అయ్యప్ప సేవా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఈనెల 25న ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు సంస్థ రాష్ట్ర కోశాధికారి సాధం ఆనంద్‌ తెలిపారు. దాదాపు 20కి పైగా కంపెనీలు ఇందులో పాల్గొని 1,500 పైగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

స్కూళ్లకు మరో 2 రోజులు సెలవులు: Click Here

జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ మినీ స్టేడియం సమీపంలోని దీక్ష జూనియర్‌ కళాశాలలో ఈ జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన పదో తరగతి నుంచి డిగ్రీ, పీజీ, వృత్తివిద్యా కోర్సులు పూర్తి చేసిన యువతీ, యువకులు ఈ మెగా జాబ్‌ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

#Tags