28న మెగా జాబ్‌మేళా

కంచరపాలెం: జిల్లా ఉపాధి కార్యాలయం నేషనల్‌ కెరీర్‌ సర్వీస్‌ సెంటర్‌లో ఈ నెల 28న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎంప్లాయిమెంట్‌ అధికారులు సిహెచ్‌ సుబ్బిరెడ్డి(క్లరికల్‌), కె.శాంతి(టెక్నికల్‌) తెలి పారు.
megajobmela

లలితా జ్యువెలరీ మార్ట్‌, కల్యాణ్‌ జ్యువెలర్స్‌, డెక్కన్‌ ఫైన్‌ కెమికల్స్‌, స్పందన స్ఫూర్తి, ఫైనాన్సియల్‌, హానర్‌ ల్యాబ్స్‌, హెటిరో డ్రగ్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, టీమ్‌ లీజ్‌ తదితర ప్రైవేట్‌ కంపెనీల్లో 415 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు ఏర్పాటు చేశారు. జ్యువెల్లరీ మార్కెటింగ్‌, అసోసియేట్‌ ఏజెంట్‌, బ్రాంచ్‌ రిలేషన్‌ షిప్‌ ఎగ్జిక్యూటివ్స్‌, రిలేషన్‌ షిప్‌, ప్రోసెస్‌ అసోసియేట్‌, కాల్‌ అసిస్టెంట్‌, ఆపరేటర్‌, కెమిస్ట్‌, క్యాషియర్‌, జూనియర్‌ క్యాడ్‌ ఇంజినీర్‌, కార్పెంటర్‌, వేర్‌హౌస్‌ అసోసియేట్స్‌, జీఐఎస్‌ ఇంజినీర్‌ క్యాడ్‌, అకౌంటెంట్‌, సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌, ఫైనాన్స్‌ ఎగ్జిక్యూటివ్‌, కేర్‌ టేకర్స్‌, సెక్యూరిటీ గార్డ్స్‌, బ్రాంచ్‌ గొడౌన్‌ ఇన్‌చార్జి, కంప్యూటర్‌ ఆపరేటర్‌ తదితర ఉద్యోగాలకు ఇంటర్‌, ఏదైనా డిగ్రీ, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌, ఐటీఐ, డిప్లమో, బీటెక్‌, ఎంబీఏలో ఉత్తీర్ణత సాధించిన 18–39 ఏళ్ల వయసు గల పురుష, మహిళా అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు https://www.ncs.gov.in లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

#Tags