Job mela: ఈనెల 14న వికాసలో జాబ్‌మేళా

Job Mela

కాకినాడ సిటీ: వికాస కార్యాలయంలో ఈనెల 14న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ కె లచ్చారావు శుక్రవారం తెలిపారు. డబ్ల్యూఎస్‌ గ్లోబల్‌ సర్వీసెస్‌ కంపెనీలో నాన్‌ వాయిస్‌ (సర్వెలెన్స్‌), భీమా జ్యువెల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో బిజినెస్‌ మేనేజర్స్‌, డిపార్టుమెంట్‌ మేనేజర్స్‌, సీనియర్‌ ఎగ్జిక్యూటీవ్స్‌, సేల్స్‌ ఆఫీసర్‌, బిల్లింగ్‌ అండ్‌ క్యాషియర్‌, మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటీవ్‌, కస్టమర్‌ రిలేషన్‌ ఎగ్జిక్యూటీవ్‌, అకౌంట్స్‌, ఎగ్జిక్యూటీవ్‌, డ్రైవర్‌ అండ్‌ ఎలక్ట్రీషియన్‌, ముత్తూట్‌ ఫైనాన్స్‌ కంపెనీలో ఇంటర్నషిప్‌, ప్రొహిబిషన్‌ ఆఫీసర్‌, నిట్‌ (ఐసిఐసిఐ)బ్యాంక్‌లో రిలేషన్‌షిప్‌ మేనేజర్‌, డెక్కన్‌ కెమికల్స్‌ కంపెనీలో ట్రైనీ, ఇసుజు మోటార్స్‌,

డిక్సాన్‌ అండ్‌ హోండాయ్‌ మోబీస్‌ కంపెనీల్లో టెక్నిషయన్‌ ఉద్యోగాలకు ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌, ఐటిఐ, డిప్లామో, డిగ్రీ, బిటెక్‌, ఎంకామ్‌ అండ్‌ ఎంబిఏ ఉత్తీర్ణులైన 35 ఏళ్ల లోపు అభ్యర్థులు అర్హులన్నారు. వీరికి నెలకు రూ.12 వేలు నుంచి రూ.25 వేలు వరకు జీతం, ఇన్సెంటివ్‌, భోజనం, వసతి, రవాణా సౌకర్యం ఆయా ఉద్యోగాలను బట్టి ఉంటుందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 14వ తేదీ కలెక్టరేట్‌ ఆవరణలోని వికాస కార్యాలయం వద్ద ఉదయం 9 గంటలకు సర్టిఫికెట్స్‌ జెరాక్స్‌లతో హాజరుకావచ్చని పీడీ వివరించారు.

#Tags