Gurukula School jobs: గురుకుల పాఠశాలలో ఉద్యోగాలకు దరఖాస్తులు

Gurukula School jobs

నల్లగొండ జిల్లాలోని మైనార్టీ గురుకులాల్లో అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపధికన నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి టి.విజయేందర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న మైనార్టీ గురుకుల పాఠశాల, కళాశాలల్లో పీసీఈ, సెక్యూరిటీ గార్డులు, హౌస్‌ కీపింగ్‌ పోస్టుల కోసం సీ్త్ర, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

అభ్యర్థుల అనుభవం ఆధారంగా మెరిట్‌ జాబితా తయారు చేస్తామని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ జిల్లా మైనార్టీ సంక్షేమ కార్యాలయంలో, రీజనల్‌ లెవల్‌ కోఆర్డినేటర్‌ కార్యాలయం–నల్లగొండ, హెచ్‌–కంప్యూటర్‌ ఏజెన్సీ నల్లగొండలో ఈ నెల 29తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు.

#Tags