Teachers Transfer: టీచర్ల బదిలీల్లో దారుణం మండి పడుతున్న ఉపాధ్యాయులు
అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల 'పని సర్దు బాటు' ప్రక్రియ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీవ్ర గం దరగోళానికి తెర తీస్తోంది. ఈ విద్యా సంవత్సరం కోసం చేపడుతున్న ఈ ప్రక్రియ ప్రహసనంగా మారింది. ప్రాథమిక విద్యకు, ఎస్జీటీలకు తల పోటుగా తయారైంది. ఈ నెల 8న ప్రారంభమైన 'మిగులు టీచర్ల సర్దుబాటు ప్రక్రియ' సాగుతూనే ఉంది.
గెస్ట్ లెక్చరర్ ఉద్యోగాలు: Click Here
ఎస్జీటీలకు పదోన్నతులు
ఎట్టకేలకు మండలస్థాయి సర్దుబాటును మూడు రోజుల కిందట పూర్తి చేశారు. ఇక్కడంతా తప్పుల తడకగా, తూతూమంత్రంగా ముగించే శారు. 'సర్దుబాటు'.. ప్రాథమిక పాఠశాలలకు శాపంగా మారింది. ఉన్నత పాఠశాలల్లో అవసరమైన మేరకు సబ్జెక్టు టీచర్లను నియమించడమే లక్ష్యంగా 117 జీఓను అనుసరించి సర్దుబాటు చేస్తున్నారు. మిగులుగా ఉన్న సబ్జెక్టు టీచర్లను సర్దుబాటు చేస్తే సరిపోతుంది. కానీ ప్రాథమిక పాఠశాలల్లో పని చేస్తున్న ఎస్జీటీలను సబ్జెక్టు మెథడాలజీని బట్టి ఉన్నత పాఠశాలలకు బలవంతంగా సర్దుబాటు చేస్తు న్నారు. గతేడాదే ఎస్జీటీలకు పదోన్నతులు కల్పిం చారు. విల్లింగ్ ఉన్న ప్రతి ఎస్జీటీకీ పదోన్నతి కల్పించి ఉన్నత పాఠశాలలకు కేటాయించారు.
ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల్లో పని చేస్తున్న ఎన్జీటీలు వివిధ వ్యక్తిగత కారణాల వల్ల పదోన్నతులు వదులుకుని కొనసాగుతున్నారు. వారినే సబ్జెక్టు టీచర్లుగా ఉన్నత పాఠశాలలకు వెళ్లాలంటూ బలవంతం చేస్తున్నారు. తాము స్కూల్ అసిస్టెంట్గా వెళ్లేందుకు నాట్ విల్లిం గ్ ఇచ్చామని, ఇప్పుడేమో సబ్జెక్టులు బోధించాలం టూ సర్దుబాటు చేయడం ఎంతవరకు సమం జసమని ప్రశ్నిస్తున్నారు.
ఎస్జీటీలను ఉన్నత పాఠశా లలకు పంపుతుండడతో చాలా స్కూళ్లు ఏకో పాద్యాయ స్కూళ్లుగా మారుతున్నాయి. భవిష్య త్తులో వీటి ఉనికి ప్రశ్నార్థకం కానుందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు వాపోతున్నారు. సా... గుతోన్న సర్దుబాటు ప్రక్రియ వారాల తరబడి సర్దుబాటు ప్రక్రియ సాగుతుండ డంతో స్కూళ్లలో బోధనకు ఇబ్బందిగా మారింది. సర్దుబాటులో ఎవరు ఏ స్కూల్కు వెళ్లాలో అనే కంగారుతో టీచర్లు చదువుపై దృష్టి పెట్టలేకపోతు న్నారు. జూనియర్లను సీనియర్లుగా, సీనియర్లను జూనియర్లుగా చూపిస్తూ తీవ్ర గందరగోళానికి తెర తీశారు.
తపోవనం స్కూల్లో సర్దుబాటు ఏదీ? అనంతపురం రూరల్ మండలం తపోవనం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్, గణితం సబ్జె క్టుల్లో ఒక్కో టీచరును మిగులుగా చూపించారు. ఇంగ్లిష్ టీచరు తాను సీనియర్సంటూ అందుకు సంబంధించి ఆధారాలు చూపించి మినహాయిం పు పొందారు. ఈయన కాకుంటే మరోటీచరునైనా బయటకు పంపాలి.
అది జరగలేదు. గణితం సబ్జెక్టులోనూ మిగులుగా చూపించిన టీచరు తాను సీనియర్ నంటూ ఆధారాలను ఉన్నతాధికారులకు చూపించి మినహాయింపు పొందారు. తర్వాతి టీచరును మిగులుగా చూపిం చి ఏదో 'ఒక స్కూల్కు సర్దుబాటు చేయాల్సి ఉం ది. అలా చేయకుండా స్కూల్లో ఓ కీలక టీచరు మంత్రాంగం నడిపారు. ప్రత్యేక కేటగిరీ టీచర్లకు మండలస్థాయిలో మినహాయింపు లేదు. డివిజన్ స్థాయిలో ఉంటుంది. పక్కా స్కెచ్ వేసి సదరు టీచరును డివిజనల్ స్థాయిలో మిగులు కింద చూపించారు.
ఆమె ప్రత్యేక కేటగిరీకి అర్హురాలు కావడంతో మినహాయింపు పొందారు. ఏది ఏమైనా ఈ స్కూల్ నుంచి ఒక్క టీచరునూ సర్దు బాటు చేయలేదు. రూరల్ మండలం చియ్యేడు ఉన్నత పాఠశాలకు గణితం సబ్జెక్టు టీచరు అవ సరం కాగా... రుద్రంపేట ప్రాథమిక పాఠశాల నుంచి ఎస్జీటీని సర్దుబాటు చేశారు. తపోవనం జెడ్పీ స్కూల్ లో గణితం సబ్జెక్టు టీచరు మిగులుగా ఉన్నా... ఎస్జీటీని పంపడం వెనుక ఉద్దేశం ఏంటో అధికారులకే తెలియాలి. పెనుకొండలో కొత్త వివాదం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలో కొత్త వివాదం తలెత్తింది.
మండల స్థాయి సర్దుబా టులో చూపించని టీచరును డివిజినల్ స్థాయిలో మిగులుగా చూపించారు. పెనుకొండ పట్టణం దర్జీపేట ఉర్దూ ఉన్నత పాఠశాలలో ఒక తెలుగు టీచరు మిగులుగా ఉన్నారు. మండలంలోనే సీని యర్ కావడంతో ఆయనకు మంచి స్కూల్ దొరుకుతుందనే కారణంగా ఎంఈఓ-2 ఎంట్రీ ఇచ్చి సదరు టీచరును మండలస్థాయిలో మిగులుగా చూపించకుండా వ్యూహం రచించారు. ఇప్పుడు అదే తెలుగు టీచరును డివిజన్ స్థాయిలో ఆదే ఎంఈఓ-2 మిగులుగా చూపించారు. ఇం దుకు బాధ్యులెవరో విద్యాశాఖ ఉన్నతాధికారులే చెప్పాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు మండిపడుతున్నారు.