Govt Colleges Guest Faculty Jobs: ప్రభుత్వ కళాశాలల్లో గెస్ట్‌ ఫ్యాకల్టీ ఉద్యోగాలు

Guest Faculty Jobs

భీమవరం: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో గెస్ట్‌ లెక్చరర్లుగా పనిచేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా ఇంటర్మీడియెట్‌ విద్యాశాఖాధికారి ఎ.నాగేశ్వరరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. వీరవాసరం కళాశా లలో బోటనీ, ఈఈటీ కోర్సు, ఈటీ కోర్సు, యండగండిలో ఇంగ్లిష్‌, గణపవరంలో ఎంపీహెచ్‌డబ్ల్యూఏ, పెంటపాడులో ఓఏఎస్‌, యలమంచిలిలో ఇంగ్లిష్‌ సబ్జెక్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

Mega job mela: 25న మెగాజాబ్‌ మేళా: Click Here

అభ్యర్థులు పోస్టు గ్రాడ్యుయేషన్‌లో 50 శాతం మార్కులు సాధించి ఉండాలన్నారు. దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఈనెల 24న భీమవరంలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయం, ఎస్‌జీవీఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఎంపికకు హాజరుకావాలని తెలిపారు. విశ్రాంత, జూనియర్‌ అధ్యాపకులకు ప్రాధాన్యమిస్తామన్నారు.

#Tags