Students Free DSC Coaching: విద్యార్థులకు ఉచిత డీఎస్సీ కోచింగ్
కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో డీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్న వంద మంది షెడ్యూల్డు తెగలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిణి జె. రంగలక్ష్మీదేవి తెలిపారు.
ఏపీ తెలంగాణలో స్కూళ్లకు మరో 2 రోజులు సెలవులు: Click Here
డీఎస్సీ పరీక్షలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి శిక్షణ పొందగోరు అభ్యర్థులు తమ కుల, నివాస ధ్రువీకరణ పత్రాలతో పాటు 10వ తరగతి నుంచి ఆపై విద్యార్హతలకు సంబంధించి సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, బయోడేటాతో ఈ నెల 26వ తేదీన బిర్లాగేట్‌లోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో హాజరు కావాలన్నారు. డిగ్రీ/ ఇంటర్ + డీఎడ్ పరీక్షలో పొందిన మార్కులను బట్టి మెరిట్ ప్రాతిపదికన లేదా రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తామన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు. పూర్తి సమాచారం కోసం సెల్: 94910 30041 నంబర్‌లో సంప్రదించాలన్నారు.