Free training for unemployed youth: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అనంతరం ఉద్యోగావకాశాలు

Free training for unemployed youth

ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో నడుస్తున్న నైపుణ్య కళాశాలలో గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి ఆధారిత కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి సాయి కృష్ణచైతన్య ఒక ప్రకటనలో తెలిపారు.

సింధియాలోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌్‌ మారిటైమ్‌ అండ్‌ షిప్‌ బిల్డింగ్‌(సెమ్స్‌)లో శిక్షణ ఇస్తామని, ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. 18 నుంచి 23 ఏళ్ల వయసు కలిగి ఐటీఐలో వెల్డర్‌ పూర్తి చేసిన నిరుద్యోగ యువతకు వెల్డింగ్‌ కోర్సులో 4 నెలల పాటు ఉచిత శిక్షణతోపాటు ఉచితంగా వసతి కల్పిస్తామన్నారు.

Anganwadi jobs: అంగన్‌వాడీలో ఉద్యోగాలు

శిక్షణ అనంతరం ప్రముఖ సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఆసక్తి కలిగిన గ్రామీణ నిరుద్యోగ అభ్యర్థులు విశాఖపట్నం సింధియా జంక్షన్‌లోని సెమ్స్‌ కేంద్రంలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 85006 87750 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

#Tags