Free training in skill development: స్కిల్ డెవలప్‌మెంట్‌లో ఉచిత శిక్షణ
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే ఐటీఐ విద్యార్థుల్లో లైఫ్ స్కిల్స్ అవసరమని ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ సుధాకర్ అన్నారు. ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ లోని స్కిల్ హబ్‌లో లైఫ్‌స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ ముగింపు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు.
కార్యక్రమంలో పాల్గొన్న ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఐటీఐ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు బెంగళూరుకు చెందిన ఉన్నతి ఫౌండేషన్ ఆధ్వ ర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. ప్రభుత్వం ఐటీఐ పూర్తి చేసిన విద్యా ర్థులకు వంద శాతం ఉపాధి, ఉద్యోగ కల్పన లక్ష్యంగా ముందుకు సాగుతోందని తెలిపారు.
ఇందుకోసమే స్కిల్ హబ్‌లు నిర్వహిస్తోందన్నారు. విద్యార్థులకు ఉద్యోగాలు లభించాలంటే కమ్యూనికేషన్ స్కిల్, ఇంగ్లిష్ పరిజ్ఞానం, సాఫ్ట్‌స్కిల్స్, లైఫ్ స్కిల్స్ అవసరంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో శిక్షణ అధికారులు కామేశ్వరరావు, విద్యాసాగర్, రంజిత్‌కుమార్ పాల్గొన్నారు.