Free Spoken English Classes: Spoken English లో ఉచిత శిక్షణ

Free Spoken English

చేవెళ్ల: చేవెళ్లలో నేటినుంచి మూడురోజులపాటు ఉచిత స్పోకెన్‌ ఇంగ్లిష్‌ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఏఎస్‌.రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. చేవెళ్ల మండలానికి చెందిన యువత, ప్రజలకు 1000 మందికి మూడురోజుల పాటు ఉచిత శిక్షణతో పాటు ఇంగ్లీష్‌ మెటీరియల్‌ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

చేవెళ్ల మండలంలోని వివేకానంద ఇంటర్‌నేషనల్‌ స్కూల్‌ పక్కనే ఉన్న సిద్ధార్థ బీఈడీ కళాశాల భవనంలో శిక్షణ తరగతలు ఉంటాయనిచెప్పారు. వయస్సుతో నిమిత్తం లేకుండా అందరూ పాల్గొనవచ్చునని తెలిపారు. మరిన్ని వివరాలకు 95506 41058 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

#Tags