Government jobs: Groups, SSC, RRB, Banks ప్రభుత్వ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ

Free Coaching for Groups government jobs

ఆసిఫాబాద్‌అర్బన్‌: జిల్లాలోని నిరుద్యోగులకు షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గ్రూప్స్‌, ఎస్‌సీఆర్‌, ఆర్‌ఆర్‌బీ, బ్యాంకింగ్‌ తదితర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం మూడు నెలల స్పెషల్‌ ఫౌండేషన్‌ కోర్సు ద్వారా ఉచిత శిక్షణ అందించనున్నట్లు ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ సజీవన్‌ తెలిపారు. ఈ నెల 16న కాగజ్‌నగర్‌ పట్టణంలోని సాయితేజా డిగ్రీ కళాశాలలో స్పాట్‌ అడ్మిషన్లు కల్పిస్తామని పేర్కొన్నారు.

Good news for Anganwadis: అంగన్‌వాడీలకు గుడ్‌న్యూస్‌

డిగ్రీ మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తామని తెలిపారు. అభ్యర్థులు కుల, ఆదాయ, విద్యార్హత, ఆధార్‌ కార్డు జిరాక్సులు, రెండు పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలతో స్పాట్‌ అడ్మిషన్లకు హాజరు కావాలని సూచించారు. అర్హత గల వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 99852 74060, 82472 99217 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

#Tags