Education Department Clerk jobs: విద్యాశాఖలో 10వ తరగతి, Inter అర్హతతో క్లర్క్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు జీతం నెలకు 56900
భారత ప్రభుత్వం , ఎడ్యుకేషన్ మినిస్ట్రీ , హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పరిధిలో గల బోర్డ్ ఆఫ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ( ఈస్టర్న్ రీజియన్ ) సంస్థ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ రిక్రూట్మెంట్ లో భాగంగా అప్పర్ డివిజన్ క్లర్క్ , లోయర్ డివిజన్ క్లర్క్ , మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీ చేయనున్నారు.
డిగ్రీ BTech అర్హతతో NSIC పరిశ్రమ శాఖలో అసిస్టెంట్ మేనేజర్ పర్మినెంట్ ఉద్యోగాలు నెలకు జీతం 63000: Click Here
రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : బోర్డ్ ఆఫ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ( ఈస్టర్న్ రీజియన్ ) సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది
మొత్తం ఉద్యోగాల సంఖ్య : 03
భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
అప్పర్ డివిజన్ క్లర్క్ – 01
లోయర్ డివిజన్ క్లర్క్ – 01
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 01
విద్యార్హతల వివరాలు :
అప్పర్ డివిజన్ క్లర్క్ : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉత్తీర్ణత సాధించి వుండాలి లేదా తత్సమాన అర్హత కలిగి వుండాలి.
లోయర్ డివిజన్ క్లర్క్ : ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ యూనివర్సిటీ నుండి 12 వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి లేదా తత్సమాన అర్హత కలిగి వుండాలి.
ఇంగ్లీష్ లో అయితే నిముషానికి 35 పదాలు , హిందీ లో అయితే నిముషానికి 30 పదాలు కంప్యూటర్ పై టైప్ చేయగలిగే పరిజ్ఞానం వుండాలి.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ : 10 వ తరగతి లేదా తత్సమాన అర్హత కలిగి వుండాలి.
వయస్సు :
అప్పర్ డివిజన్ క్లర్క్ , లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకు 27 సంవత్సరాల లోపు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు 25 సంవత్సరాల లోపు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు నిర్ధారణ కొరకు 29/12/2024 ను కట్ ఆఫ్ తేది గా నిర్ణయించారు.
ఎస్సీ , ఎస్టీ వారికి 5 సంవత్సరాలు , ఓబీసీ వారికి 3 సంవత్సరాలు , దివ్యాంగులు వారికి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
దరఖాస్తు విధానం :
అభ్యర్థులు మొదటిగా ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆ తర్వాత ఆ ప్రింటెడ్ అప్లికేషన్ ను ప్రింట్ తీసి , సంబంధిత ధృవపత్రాలు జత చేసి , పోస్ట్ ద్వారా లేదా నేరుగా ఈ క్రింద తెలిపిన చిరునామాకు పంపించాలి.
దరఖాస్తు చేరవలసిన చిరునామా: The Administrative-cum-Accounts Officer Board of Practical Training (Eastern Region) Block-EA, Sector-I (Opposite Labony Estate) Kolkata-700064.
ఎంపిక విధానం : కంప్యూటర్ ఆధారిత వ్రాత పరీక్ష నిర్వహణ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
జీతం:
అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగానికి ఎంపిక కాబడిన వారికి 7 వ సిపిసి ప్రకారం లెవెల్ – 4 పే స్కేల్ (25,500 – 81,100 రూపాయలు ) జీతంగా లభిస్తుంది.
లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగానికి ఎంపిక కాబడిన వారికి 7 వ సిపిసి ప్రకారం లెవెల్ – 2 పే స్కేల్ (19,900 – 63,200 రూపాయలు ) జీతంగా లభిస్తుంది.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగానికి ఎంపిక కాబడిన వారికి 7 వ సిపిసి ప్రకారం లెవెల్ – 1 పే స్కేల్ (18,000 – 56,900 రూపాయలు ) జీతంగా లభిస్తుంది.
ముఖ్యమైన తేదిలు:
ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేది : 29/11//2024 ఉదయం 10:00 గంటల నుండి
ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేయడానికి చివరి తేది : 29/12/2024.
హార్డ్ కాపీ ని కార్యాలయ చిరునామాకు చేరవేయడానికి చివరి తేది : 13/01/2025 సాయంత్రం 6:00 గంటల లోగా అప్లై చేయాలి.