CWC jobs: డిగ్రీ అర్హతతో Central Warehousing Corporation లో మేనేజ్ మెంట్ ట్రైనీ ఉద్యోగాలు జీతం నెలకు 93,000
న్యూఢిల్లీలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ దేశంలో ఉన్న అన్ని సీడబ్ల్యూసీ కార్యాలయాలు, కన్ స్ట్రక్షన్ సెల్స్, ఐసీడీఎస్, సీఎఫ్ ఎస్ఎస్, వేర్ హౌసుల్లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
Fake Universities List in India: భారతదేశంలో నకిలీ విశ్వవిద్యాలయాల జాబితా విడుదల: Click Here
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 179
పోస్టుల వివరాలు: మేనేజ్ మెంట్ ట్రైనీ(జనరల్)-40, మేనేజ్ మెంట్ ట్రైనీ (టెక్నికల్)-13, అకౌంటెంట్-09, సూపరింటెండెంట్ (జనరల్)- 22, జూనియర్ టెక్నికలక్ అసిస్టెంటక్ -81, సూపరింటెండెంట్(జనరల్)- ఎస్ఆర్ డీ(ఎన్ ఈ)-02, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్- ఎస్ ఆర్ డీ(ఎన్ఈ)-10, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్- ఎన్ ఆర్ డీ(లడఖ్, యూటీ)-02 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీకాం, సీఏ, పీజీ, ఎంబీఏ పాసై ఉంటే సరిపోతుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి.
జీతం: నెలకు మేనేజ్ మెంట్ ట్రైనీ ఉద్యోగాలకు సంబంధించి రూ.60వేల నుంచి రూ.1లక్ష 80వేలు, అకౌంటెంట్, సూపరింటెండెంట్ ఉద్యోగాలకు రూ.40వేల నుంచి రూ.1లక్ష 40వేలు, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి రూ.29,000 నుంచి రూ.93,000 వేతనం ఉంటుంది.
వయస్సు: 2025 జనవరి 12 నాటికి అకౌంటెంట్, సూపరింటెండెంట్ పోస్టులకు 30 ఏళ్లు, ఇతర పోస్టులకు 28 ఏళ్ల వయస్సు మించి ఉండకూడదు.
సెలెక్ట్ చేసే విధానం: ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తుకు చివరి తేది: 2025 జనవరి 12
అఫీషియల్ వెబ్ సైట్: https://cewacor.nic.in