Constable posts: పదో తరగతి అర్హతతో వేలల్లో కానిస్టేబుల్ ఉద్యోగాలు నోటిఫికేషన్‌ ఎప్పుడంటే..

ఉద్యోగార్థులకు గుడ్​న్యూస్​. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని సాయుధ విభాగాల్లో వేల సంఖ్యలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్​ వెలువడనుంది.
Constable Jobs

ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కలలు కనేవారికి దీపావళి కానుక! కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సాయుధ బలగాల్లో వేలల్లో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) కసరత్తు చేస్తోంది. ఎస్‌ఎస్‌సీ వార్షిక క్యాలెండర్‌ ప్రకారం ఈనెల 24న నోటిఫికేషన్‌ వెలువడనుంది.

పోస్టులు..
Constable Ground Duty Vacancy 2023 : కానిస్టేబుల్ (గ్రౌండ్‌ డ్యూటీ)

విద్యార్హత..
Constable Ground Duty Qualification : త్వరలో విడుదల కానున్న ఈ ఉద్యోగ నోటిఫికేషన్​లోని పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు కనీసం పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

ఏఏ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయంటే? ( Constable Ground Duty Departments )

  • ఐటీబీపీ
  • ఎస్‌ఎస్‌బీ
  • బీఎస్‌ఎఫ్‌
  • సీఐఎస్‌ఎఫ్‌
  • సీఆర్‌పీఎఫ్‌
  • ఎన్‌సీబీ సిపాయి
  • ఎస్‌ఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ)
  • అస్సాం రైఫిల్స్‌ రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ)

ఎంపిక ఇలా ( Constable Ground Duty Selection Process )

  • రాత పరీక్ష
  • ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్​
  • ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్​
  • వైద్య పరీక్షలు
  • డాక్యుమెంట్స్​ వెరిఫికేషన్​
  • అలాగే రిజర్వేషన్​లను అనుసరించి వివిధ సాయుధ బలగాల్లోని ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక అవుతారు.

పరీక్ష తేదీ ( Constable Ground Duty Exam Dates )

  • కానిస్టేబుల్(గ్రౌండ్‌ డ్యూటీ) రాత పరీక్షలను 2024 ఫిబ్రవరి 20 నుంచి విడతలవారీగా రాత పరీక్షలను నిర్వహిస్తారు.
  • ఫిబ్రవరి 20, 21, 22, 23, 24, 26, 27, 28, 29; మార్చి 1, 5, 6, 7, 11, 12వ తేదీల్లో దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన పరీక్ష కేంద్రాల్లో ఈ ఎగ్జామ్​ను నిర్వహించనున్నారు.

ముఖ్యమైన తేదీలు (Constable Ground Duty Jobs Important Dates)

  • నోటిఫికేషన్​ విడుదల తేదీ- 2023 నవంబర్​ 24
  • దరఖాస్తుకు చివరితేదీ- 2023 డిసెంబర్‌ 28

SSC Official Website : వయోపరిమితి సహా నోటిఫికేషన్​కు సంబంధించిన పూర్తి వివరాలు నవంబర్ 24న తెలియనున్నాయి. ఇందుకోసం అభ్యర్థులు ఎప్పటికప్పుడు ఎస్​ఎస్​సీ అధికారిక వెబ్​సైట్​ను చెక్​ చేసుకోవచ్చు.

కానిస్టేబుల్​, ఎస్​ఐ ఉద్యోగాలు..
SSB Recruitment 2023 : ఇటీవలే కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. సశస్త్ర సీమ బల్‌(ఎస్‌ఎస్‌బీ)లో 2023 సంవత్సరానికి సంబంధించి 111 సబ్​ ఇన్​స్పెక్టర్​(ఎస్​ఐ) పోస్టులు, 272 కానిస్టేబుల్​ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్​ను విడుదల చేసింది. ఈ రెండిటికి సంబంధించి దరఖాస్తు గడువు కూడా మరికొద్ది రోజుల్లోనే ముగియనుంది.

#Tags