Police Constable Events Postponed: ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల దేహ దారుఢ్య పరీక్షలు వాయిదా
ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ఎంపిక ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న దేహ దారుఢ్య పరీక్షలు కొన్ని జిల్లాల్లో వాయిదా వేయడం జరిగింది. వైకుంఠ ఏకాదశి , శాంతిభద్రతల ను దృష్టిలో పెట్టుకొని ఈనెల 8వ తేదీ నుంచి 10వ తేదీ మధ్య జరగాల్సిన దేహదారుఢ్య పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు పోలీస్ నియామక మండలి ఒక ప్రకటనలో తెలిపింది. మిగతా తేదీల్లో నిర్వహించాల్సిన దేహదారుఢ్య పరీక్షలు యధావిధిగా జరుగుతాయి.
భారతదేశంలో నకిలీ విశ్వవిద్యాలయాల జాబితా విడుదల: Click Here
కొత్త తేదీలు ఇవే :
శ్రీకాకుళం , విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో జనవరి 8వ తేదీన నిర్వహించాల్సిన దేహదారుఢ్య పరీక్షలను జనవరి 11వ తేదీన నిర్వహిస్తారు.
అనంతపురంలో జనవరి 8 నుండి 10వ తేదీల మధ్య నిర్వహించాల్సిన దేహదారుఢ్య పరీక్షలను జనవరి 17 , 18, 20 తేదీల్లో నిర్వహిస్తారు.
చిత్తూరులో జనవరి 8 నుండి 9 వరకు జరగాల్సిన దేహదారుఢ్య పరీక్షలను జనవరి 17, 18 తేదీల్లో నిర్వహిస్తారు.
క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారిక వెబ్సైట్లో విడుదల చేసిన ప్రకటన మీరు డౌన్లోడ్ చేసి చదవండి
గమనిక: 6,100 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో భాగంగా నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షలో పాస్ అయిన వారికి ప్రస్తుతం దేహదారుఢ్య పరీక్షలను పోలీస్ నియామక మండలి నిర్వహిస్తుంది.