Closed Telangana Anganwadi Centers: మూతపడిన తెలంగాణ అంగన్‌వాడీ కేంద్రాలు
మొయినాబాద్ రూరల్: చిన్నారులకు ఆటపాటలతో విద్య నేర్పించడానికి ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రా లను ఏర్పాటు చేసింది. తల్లిదండ్రుల తర్వాత ఆలనా పాలన చూస్తూ వారికి విద్యాబుద్ధులు నేర్పించే ఆ అంగన్వాడీ కేంద్రాలు మండలంలో మూడు మూతపడి ఉన్నాయి. ఆయా ప్రభుత్వాల ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాలలోపు పిల్లలకు బాలామృతం తో పాటు గుడ్లు సరఫరా చేస్తారు. ఇవే కాకుండా పిల్లలను పాఠశాలలో చేర్పించుకొని వారికి ఆటాపా టలతో పాటు కావాల్సిన ధ్రువపత్రాలు అందజే స్తారు. కేంద్రాలు మూతపడి ఉండడంతో ఆయా గ్రామాల ప్రజలకు సేవలు దూరమవుతున్నాయి.
రేపు జాబ్ మేళా: Click Here
మూడు కేంద్రాలు మూత
మొయినాబాద్ మండలంలో మొత్తం 59 అంగన్ వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ మండలంలో రెండు సెక్టార్లుగా విభజించి ఇద్దరు సూపర్వైజర్లు పర్యవేక్షణ చేస్తున్నారు. మండల పరిధిలోని రెండు సెక్టార్లలో ఒకటి హిమాయత్ నగర్, మొయినాబాద్, హిమాయత్నగర్ సెక్టార్లో 59 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా మొయినాబాద్ సెక్టార్లో 58 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇం దులో మొయినాబాద్ సెక్టార్ పరిధిలోని ఎత్మార్ పల్లి గ్రామంలో అంగన్వాడీ సెంటర్ దాదాపు రెం డు సంవత్సరాల నుంచి ఆయా, అంగన్వాడీ టీచర్ లేకపోవడంతో కొంతకాలంగా గ్రామ సర్పంచ్ సొంత డబ్బులతో నడిపించారు.
సర్పంచ్ పదవీ కాలం ముగియడంతో అంగన్వాడీ సెంటర్ మూత పడిపోయింది. అదేవిధంగా శ్రీరామ్ నగర్లో టీచర్, ఆయా లేకపోవడంతో జూన్ నెలలో మూతపడింది. హిమాయత్నగర్ సెక్టార్ పరిధిలోని అజీజ్నగర్ గ్రామంలో రెండు అంగన్వాడీ కేం ద్రాలు ఉన్నాయి. అందులో ఒకటి అజీజ్ నగర్ గ్రామంలో, రెండోది ఎస్సీ కాలనీలో ఉంది. 1వ కేంద్రం అంగన్వాడీ టీచర్ జూలై నెలలో ఆమె పదవికి రాజీనామా చేసింది. అక్కడ ఆయా కూడా లేదు.
దీంతో అజీజీనగర్ 1వ అంగన్వాడీ కేంద్రం రెండు నెలల నుంచి తాళం వేసి ఉంది. ఈ గ్రామాల్లో ప్రభుత్వాల ద్వారా వచ్చే బాలామృతం, పోషకాహారాన్ని ఏడు నెలల నుంచి మూడు సంవ త్సరాలలోపు పిల్లలకు నెలకొకసారి పక్కన ఉన్న అంగన్వాడీ కేంద్రాల టీచర్లు ఇన్చార్జిలుగా వచ్చి అందిస్తున్నారు. కానీ ఈ కేంద్రాల్లో పిల్లలను చేర్పిం చడం వారికి విద్యాబుద్ధులు, ఆటాపాటలు నేర్పిం చడం లేదు. మూతపడిన అంగన్వాడీ కేంద్రాన్ని అధికారులు చొరవ తీసుకొని పిల్లలకు అందుబాటు లోకి తీసుకురావాలని కోరుతున్నారు.
సొంత డబ్బులతో నడిపించాం
మండల పరిధిలోని ఎత్మార్పల్లి గ్రామంలో కొత్తగా గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత సర్పంచ్గా ప్రజలు నన్ను గెలిపించారు. గత రెండు సం వత్సరాల నుంచి అంగన్వాడీ కేంద్రంలో ఆయా, టీచర్ ఖాళీ కావడంతో సాం త డబ్బులతో రెండు సంవత్సరాలుగా కొనసాగించాను. సర్పంచ్ పదవీ పూర్తి కావడంతో అప్పటి నుంచి ఈ అంగన్వాడీ కేంద్రం మూతపడిన మాట నిజమే. ప్రభుత్వం ద్వారా ఆం గన్వాడీ టీచర్, ఆయాను నియమించాలని ఎన్నిసార్లు సంబంధిత అధికారులకు తెలియజేసిన లాభం లేకపోయింది. ఇప్పటికైనా గ్రామ పంచాయతీ అయిన ఎత్మార్పల్లిలో ఒకే ఒక్క అంగన్వాడీ కేంద్రం ఉంది. ఈ కేంద్రం ప్రజలకు ఉపయోగపడేలా చూడాలి. - గుండాల నవనీతరాజు, మాజీ సర్పంచ్, ఎత్మార్పల్లి
అధికారులకు తెలియజేశాం
మొయినాబాద్ మండలంలో 59 అంగన్ వాడీ కేంద్రాలు ఉన్న మాట నిజమే. అందులో మూడు ఆంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు, ఆయాలు లేక మూతపడి ఉన్నాయి. ప్రతి నెల ఈ ఆంగ న్వాడీ కేంద్రాల్లో ఇన్చార్జిలుగా ఉన్న పక్క అంగ న్వాడీ కేంద్రాల టీచర్లు బాలామృతం, గుడ్లు సరఫరా చేస్తారు. టీచర్, ఆయాలు లేని విష యాన్ని పైఅధికారులకు తెలియజేశాం. - యక్ల్యూబా, సీడీపీఓ, చేవెళ్ల