AP TS Anganwadi Latest News: అంగన్‌వాడీలకు బిల్లులు

AP TS Anganwadi Bills Latest News

మంచిర్యాలటౌన్‌: అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలకు ఏడాదికి పైగా అద్దె చెల్లించాల్సి ఉంది. దీంతో ఆయా కేంద్రాలు నిర్వహిస్తు న్న అంగన్‌వాడీ టీచర్లు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ‘అద్దె డబ్బులు వస్తాయి, చెల్లిస్తాం..’ అంటూ ఇళ్ల యజమానులకు ప్రతీ నెల ఏదో ఒక సాకు చెప్పి దాటవేయాల్సిన పరి స్థితి ఎదురవుతోంది.

ఏ డాదిగా అద్దె చెల్లించకపోవడంతో యజమానుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. గత ఏడాది నవంబర్‌లో జరిగిన ఎన్నికలకు ముందే అద్దె డబ్బుల చెల్లింపునకు అధికా రులు సిద్ధం చేసినా ఎన్నికల పేరిట వాయిదా వేసినట్లు తెలిసింది. ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం ఏర్పడినా పెండింగ్‌లో ఉన్న అద్దె బకాయిలు చెల్లించలేదు.

మూడు నెలలుగా అంగన్‌వాడీ టీచర్ల వేతనాలు పెండింగ్‌లో ఉండగా, ఇటీవ లే రెండు నెలల వేతనాలు వేశారు. అద్దె డబ్బులు సైతం వేయాలని అద్దె భవనాల టీచర్లు ఆందోళన బాట పడుతున్నారు.

అద్దె చెల్లించాలని శుక్రవారం కలెక్టరేట్‌ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ టీచర్లు ఆందోళన చేపట్టారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి చిన్నయ్యకు వినతిపత్రం అందజేశారు.

బిల్లులన్నీ పెండింగ్‌లోనే..

జిల్లాలో మొత్తం 969 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, అందులో 490 అద్దె భవనాల్లో కొనసాగుతున్నా యి. 164 కేంద్రాలకు మాత్రమే స్వంత భవనాలు ఉండగా, 315 కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలలు, ఇతర ప్రభుత్వ భవనాలు, ఉచితంగా లభించిన భవనాల్లో ఉన్నాయి.

జిల్లావ్యాప్తంగా సగానికి పైగా కేంద్రాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతుండడం గమనార్హం. ఏడాదికి పైగా అద్దె చెల్లించకపోవడంతో యజమానుల నుంచి టీచర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.

అద్దె బకాయిలతోపాటు కూరగాయలు, గ్యాస్‌ బిల్లులు, టీఏ, డీఏలు, పోషణ్‌ అభియాన్‌ డబ్బులు ఏడాదికి పైగా చెల్లించకపోవడంతో అంగన్‌వాడీ టీచర్లు వారి స్వంత డబ్బులు ఖర్చు చేసి కేంద్రాలు నిర్వహిస్తున్నారు. వేతనాలు సైతం ఆలస్యంగా వస్తుండడం, కేంద్రాల అదనపు ఖర్చులను టీచర్లే భరిస్తుండడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పెండింగ్‌లో ఉన్న బిల్లులతోపాటు అద్దె బకాయిలు వెంటనే చెల్లించాలని అంగన్‌వాడీ టీచర్లు డిమాండ్‌ చేస్తున్నారు.

#Tags