Teachers Retirement benefits news: అంగన్‌వాడీ టీచర్లకు ఇక నుంచి 2లక్షలు ఎందుకంటే..

Anganwadi Retirement Benefits News

సాక్షి ఎడ్యుకేష‌న్ : అంగన్వాడీ టీచర్లు , హెల్పర్‌కు రాష్ట్ర‌ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. అంగన్వాడీ టీచర్లు , హెల్పర్‌కు రిటైర్మెంట్‌ ప్రయోజనాలు అందిస్తామని మంత్రి సీతక్క తెలిపారు.
హైద‌రాబాద్‌లోని రహమత్‌నగర్‌లో అమ్మ మాట-అంగన్వాడీ బాట  కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.


అంగన్‌వాడీలకు ఉచిత 5G ట్యాబ్‌లు Click Here

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఇక‌పై  అంగన్వాడీ టీచర్‌కు రూ.2 లక్షలు, హెల్పర్‌కు రూ.లక్ష చొప్పున రిటైర్‌మెంట్ బెనిఫిట్‌ అందజేస్తామని ఆమె వెల్లడించారు. దీనిపై రెండు మూడు రోజుల్లో జీవో జారీ చేస్తామని మంత్రి తెలిపారు.

దాదాపు 9000 పైగా పోస్టులకు..
తెలంగాణ‌లోని మ‌హిళ‌ల‌కు మ‌రో భారీగా ఉద్యోగాల‌ నోటిఫికేష‌న్ రానున్న‌ది. అంగన్‌వాడీ కేంద్రాలను ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ ఉపాధ్యాయ, సహాయకుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్న‌ది. ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాల్లో దాదాపు 9000 పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించింది.

వీటిని వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ అనుమతులు వచ్చిన వెంటనే జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ ప్రకటనలు జారీ కానున్నాయి.

రాష్ట్రంలో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో ఉపాధ్యాయురాలితో పాటు సహాయకురాలు ఉంటారు. గతంలో ఈ పోస్టుల్లో ఎంపికైనవారు రాజీనామా చేయడం, ఇప్పటికే పనిచేస్తున్నవారికి సూపర్‌వైజర్లుగా పదోన్నతులు రావడంతో చాలా కేంద్రాల్లో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. 

అంగన్‌వాడీ ఉద్యోగాల‌కు అర్హ‌త‌లు ఇవే..
వీటి ప్రకారం.. టీచర్‌తో పాటు హెల్పర్లుగా నియమితులయ్యేవారు కనీసం ఇంటర్‌ పాసై ఉండాలి. గతంలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులకు కనీసం పదో తరగతి పాసై ఉండాలన్న నిబంధన ఉండేది. ఈసారి వయోపరిమితి 18 నుంచి 35 ఏళ్ల మ‌ధ్య‌ ఉండాలి.

అలాగే 65 ఏళ్లు దాటిన తరువాత వారి సేవలను వినియోగించుకోకూడదు. ఖాళీల్లో 50 శాతం హెల్పర్లకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాల్సి ఉంటుంది. సూపర్‌వైజర్‌ పోస్టుల్లోనూ 50 శాతం పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి. ఇందుకు అయిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న టీచర్లను నిబంధనలకు అనుగుణంగా నియమించాలి.

అయితే.., ప్రస్తుతం సహాయకులుగా పనిచేస్తున్న వారిలో కొందరికి కనీస విద్యార్హతలు లేకపోవడంతో.. టీచర్ల పోస్టుల భర్తీలో ప్రభుత్వ నిర్ణయం మేరకు వ్యవహరించాలని శిశు సంక్షేమశాఖ భావిస్తోంది.

#Tags