Staff Nurse jobs: స్టాఫ్‌ నర్సు పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

Staff Nurse jobs

గుంటూరు మెడికల్‌: గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు కార్యాలయం పరిధిలోని ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 44 కాంట్రాక్టు స్టాఫ్‌ నర్సు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు ఆర్డీ డాక్టర్‌ కె.సుచిత్ర మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను జనవరి 1 నుంచి 15వ తేదీ వరకు సాయంత్రం 5 గంటల్లోపు గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌ వెనుక ఉన్న మెడికల్‌ అండ్‌ హెల్త్‌ రీజినల్‌ డైరెక్టర్‌ కార్యాలయంలో అందజేయాలన్నారు.

Inter అర్హతతో విద్యాశాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల: Click Here

ఉద్యోగాలకు జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ, బీఎస్సీ నర్సింగ్‌ చదివిన వారు అర్హులని పేర్కొన్నారు. దరఖాస్తులను జనవరి 17 నుంచి 23వ తేదీలోపు పరిశీలించి, 24న మెరిట్‌ లిస్టు, 29న ఫైనల్‌ మెరిట్‌ లిస్టు విడుదల చేయాలని డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ కె.పద్మావతి ఆదేశాలు జారీ చేశారు. కౌన్సెలింగ్‌ జనవరి 30, 31వ తేదీల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించి, ఎంపికై న వారికి నియామక ఉత్తర్వులు అందజేయాలని వెల్లడించారు.

ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తెనాలి జిల్లా ఆసుపత్రిలో ఆరు పోస్టులు, బాపట్ల ఏరియా ఆసుపత్రిలో పది, నరసరావుపేట ఏరియా ఆసుపత్రిలో 24, ఆత్మకూరు, కందుకూరు, రాపూరు, గురజాలలో ఒక్కొక్కటి చొప్పున స్టాఫ్‌ నర్సుల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించారు.

మొత్తం పోస్టులు: 44
ఖాళీల వివరాలు: స్టాఫ్‌ నర్స్‌

విద్యార్హత: బీఎస్సీ నర్సింగ్‌, జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ
దరఖాస్తుకు చివరి తేది: జనవరి 15 వరకు సా. 5గంటలలోపు

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
(గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌ వెనుక ఉన్న మెడికల్‌ అండ్‌ హెల్త్‌ రీజినల్‌ డైరెక్టర్‌ కార్యాలయంలో మీ దరఖాస్తును అందజేయాలి)

మెరిట్‌ లిస్టు విడుదల: జనవరి 24న 
కౌన్సెలింగ్‌ : జనవరి 30,31

 

#Tags