Students Scholarships : విద్యార్థుల ప్రోత్సాహానికి విద్యా జ్యోతి స్కాల‌ర్‌షిప్‌లు..

విద్యార్థుల‌ను ప్రోత్సాహించేందుకు కెనరా బ్యాంకు డాక్టర్‌ అంబేడ్కర్‌ విద్యా జ్యోతి స్కాలర్‌షిప్‌లు అందజేస్తున్నట్లు రీజినల్‌ మేనేజర్‌ సుషాంత్‌కుమార్‌ తెలిపారు.

కర్నూలు: ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను విద్యలో మరింత ప్రోత్సహించడం లక్ష్యంగా కెనరా బ్యాంకు డాక్టర్‌ అంబేడ్కర్‌ విద్యా జ్యోతి స్కాలర్‌షిప్‌లు అందజేస్తున్నట్లు రీజినల్‌ మేనేజర్‌ సుషాంత్‌కుమార్‌ తెలిపారు. బుధవారం ఆయన హౌసింగ్‌ బోర్డు కెనరా బ్యాంకు బ్రాంచిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్సీ, ఎస్టీ విద్యార్థినులకు ఎస్సీ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ తులసిదేవితో కలసి స్కాలర్‌షిఫ్‌లు పంపిణీ చేశారు.

August 25, 26th Holidays 2024 : ఆగస్టు 25, 26న విద్యా సంస్థలకు సెలవులు.. ఎందుకంటే..?

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు జిల్లాలో 300 మంది విద్యార్థినులకు రూ.5 వేల ప్రకారం స్కాలర్‌షిప్‌లు పంపిణీ చేశామన్నారు. సోషల్‌ రెస్పాన్సిబులిటీ కింద విద్యార్థినులను ప్రోత్సహించేందుకు కెనరా బ్యాంకు డాక్టర్‌ అంబేద్కర్‌ విద్యాజ్యోతి కింద స్కాలర్‌షిప్‌లు అందజేస్తోందన్నారు. ఎల్‌డీఎం రామచంద్రరావు, కెనరా బ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు.

Faculty Jobs: ప్రొఫెసర్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. రేపే చివరి తేది

#Tags