TS Dost Admissions 2024: తెలంగాణ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు.. నేడే ‘దోస్త్’ తొలి దశ సీట్ల కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ‘దోస్త్’ ద్వారా దరఖాస్తు చేసిన విద్యార్థులకు గురువారం తొలి దశ సీట్లు కేటాయిస్తారు. సాయంత్రం 3గంటలకు విద్యా ర్థులు ఏ కాలేజీలో, ఏ కోర్సులో సీటు వచ్చిందో ఆన్‌లైన్ ద్వారా చూసుకోవచ్చని ఉన్నత విద్యా మండలి కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్ తెలిపారు. దోస్త్‌లో ఇప్పటివరకూ 1.03 లక్షల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో 85 వేల మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు.
#Tags