VAHA Training: ఆరు బృందాలుగా నియమించిన వీఏహెచ్‌ఏలకు శిక్షణ

విలేజ్‌ అనిమల్‌ హస్పెండరీ అసిస్టెంట్లను నియమించారు పశుసంవర్ధక శాఖ. ప్రస్తుతం, వారికి అందాల్సిన శిక్షణ గురించి కూడా తెలిపారు అక్కడి జేడీ డాక్టర్‌ సుబ్రహ్మణ్యం. వివరాలను పరిశీలంచండి..

అనంతపురం అగ్రికల్చర్‌: ఉమ్మడి జిల్లా పరిధిలో ఇటీవల కొత్తగా నియమితులైన 457 మంది విలేజ్‌ అనిమల్‌ హస్పెండరీ అసిస్టెంట్ల (వీఏహెచ్‌ఏ)కు ఏప్రిల్‌ 1 నుంచి 45 రోజుల శిక్షణ కార్యక్రమం ఉంటుంది. ఈ మేరకు పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్‌ వై.సుబ్రహ్మణ్యం తెలిపారు. గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఉరవకొండ డివిజన్‌లో 150 మంది, అనంతపురం డివిజన్‌లో 135 మంది, పెనుకొండ డివిజన్‌లో 67 మంది, ధర్మవరం డివిజన్‌లో 65 మంది, కదిరి డివిజన్‌లో 40 మంది వీఏహెచ్‌ఏలు విధుల్లో చేరినట్లు తెలిపారు.

Medical Students: నిరసనలో వైద్య విద్యార్థులు.. చివరికి ఇలా..!

వీరందరినీ ఆరు బృందాలుగా విభజించి బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి ప్రాంతీయ పశు శిక్షణాకేంద్రంలో రెండు బృందాలకు, సిద్ధరాంపురం పశు క్షేత్రంలో ఓ బృందానికి శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అలాగే అనంతపురంలోని జేడీఏ కార్యాలయంలో రెండు బృందాలకు, సాయినగర్‌లోని పశువైద్యశాలలో ఓ బృందానికి శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. ఇందుకోసం ఒక్కో సెంటర్‌కు ముగ్గురు రిసోర్సు పర్సన్లను నియమించినట్లు తెలిపారు. పశుసంవర్ధకశాఖ అమలు చేస్తున్న అన్ని రకాల పథకాలతో పాటు సమగ్ర పాడి, పశుపోషణ, పశువైద్యసేవలు, ఆర్‌బీకే విశిష్టతపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తారన్నారు.

Prof Abhay Karandikar: స్టార్టప్‌లకు ప్రోత్సాహం

#Tags