Survey Exam : ఏకేయూలో రెవెన్యూ ఉద్యోగులకు సర్వే పరీక్ష.. అభ్యర్థుల నమోదు శాతం!
ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన రెవెన్యూ ఉద్యోగుల 12వ బ్యాచ్ సర్వే (థియరీ, ప్లాట్టింగ్) రాష్ట్రస్థాయి పరీక్షలను ఆదివారం గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ్ పరిశీలించారు. పరీక్ష నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సర్వే ట్రైనింగ్ అకాడమీ (సామర్లకోట) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు చెందిన రెవెన్యూ శాఖ జూనియర్ సహాయకులు, వీఆర్‌ఓ గ్రేడ్–1, సహాయ సెక్షన్ అధికారులకు గతంలో 42 రోజులపాటు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ITI counselling 2024: ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే
ఈ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి పరీక్ష నిర్వహించగా అన్ని జిల్లాల నుంచి 1093 మందికిగాను 943 మంది రెవెన్యూ ఉద్యోగులు సర్వే ఎగ్జామ్‌కు హాజరయ్యారు. పరీక్షలలో 86 శాతం హాజరు నమోదయ్యింది. పరీక్ష కేంద్రంలో ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ సర్వే ట్రైనింగ్ అకాడమీ జాయింట్ డైరెక్టర్/ ప్రిన్సిపాల్ సీహెచ్‌వీఎస్‌ఎన్ కుమార్ పర్యవేక్షణలో ఈ పరీక్ష నిర్వహించారు. పరీక్షలకు గుంటూరు జిల్లా మైనార్టీ ఆఫీసర్ షేక్ మహబూబ్ షరీఫ్, పరిశీలకులుగా వ్యవహరించారు. గుంటూరు జిల్లా సహాయ సంచాలకులు వై నాగశేఖర్, ట్రైనింగ్ అకాడమీ డైరెక్టర్ ఎంవీ రంగ ప్రసాద్, ఇన్‌స్పెక్టర్ ఎస్‌వీ నాగేశ్వరరావు పరీక్షల ఏర్పాట్లను పర్యవేక్షించారు.
English Practicals in Inter : ఇంటర్ ఇంగ్లిష్‌లో కూడా ప్రాక్టికల్స్.. ఈ ఏడాది నుంచే.. ఎలా అంటే..?