Hostel Students Rally : హాస్ట‌ల్ భోజ‌నంపై విద్యార్థుల ఆగ్ర‌హం.. క‌లెక్ట‌రేట్ ఎదుట ధ‌ర్నా!

హాస్ట‌ల్ విద్యార్థుల‌కు గ‌త కొద్ది రోజులుగా స‌రైన ఆహారం ఉండ‌డం లేద‌ని, ఉన్న ఆహారం కూడా తినేలా లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ క‌లెక్ట‌ర్ ఆఫీస్ వ‌ద్దకు చేరారు..

కర్నూలు: ప్రతిష్టాత్మక కర్నూలు సిల్వర్‌ జూబ్లీ డిగ్రీ కళాశాల విద్యా­ర్థులు అన్నం కోసం రోడ్డెక్కారు. కళాశాల హాస్టళ్లలో పెడుతున్న పురుగుల అన్నం, నీళ్ల సాంబారు తినలేక కడుపులు కాల్చు­కుంటున్నామని కలెక్టరేట్‌ ఎదుట ఖాళీ ప్లేట్లతో ధర్నాకు దిగారు. తమకు కలెక్టర్‌ వచ్చి న్యాయం చేసే వరకు కదిలేదిలేదని బీష్మించారు. చివరకు డీఆర్వో వచ్చి హామీ ఇవ్వడంతో కలెక్టరేట్‌ వద్ద ధర్నాను నిలిపివేశారు. విద్యార్థులు అక్కడి నుంచి వెళ్లి ప్రిన్సిపాల్‌ కార్యా­లయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ కళాశాలలో ఘోరమైన పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. 

తాగేందుకు, స్నానం చేసేందుకు కూడా నీళ్లు లేవన్నారు. మరుగుదొడ్లను శుభ్రంచేసే వారు లేకపోవడంతో తామే ఆ పనిచేయాల్సి వస్తోందన్నారు. కళాశాలలో చదవే ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థుల మెస్‌ చార్జీలను క్లస్టర్‌ యూనివర్సిటీ వసూలు చేసుకుని నిర్వహణకు ముందుకురాకపోవడంతోనే ఇబ్బందులు తలెత్తాయన్నారు. విద్యార్థులు చెల్లించే మెస్‌ చార్జీల్లో అధిక భాగం బియ్యం కొనుగోలుకే సరిపోతుండటంతో గతం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మానవత్వంతో సిల్వర్‌ జూబ్లీ కళాశాలకు అవసరమయ్యే బియ్యాన్ని కేజీ రూపాయికే ఇచ్చేలా జీవో ఇచ్చిందని వివరించారు.

Degree Admissions 2024: ఈ నెలాఖరు నుంచే డిగ్రీ క్లాసులు ప్రారంభం.. గతంతో పోలిస్తే పెరిగిన అడ్మిషన్ల

అయితే, టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ జీవోను అమలు చేయడంలేదన్నారు. దీంతో ప్రస్తుతం కేజీ బియ్యం కోసం కళాశాల రూ.41 చెల్లిస్తోందన్నారు. గత ప్రభుత్వం జారీ చేసిన జీవో అమలైతే కేజీ బియ్యం రూపాయికే వస్తాయని, మిగిలిన రూ.40లతో వంటకు అవసరైన కూరగాయలు, నూనెలు, ఇతర అన్ని రకాల సరుకులు కొనుగోలు చేసి విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. ప్రభుత్వం స్పందించి సిల్వర్‌ జూబ్లీ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

ఒక రోజు.. రెండు రోజులు కాదు.. నెల రోజులుగా వారికి పురుగుల అన్నమే దిక్కవుతోంది. కుళ్లిన వంకాయలు, టమాటాలతో చేసిన సాంబారు, మజ్జిగ తప్ప.. ఇతర కూరలు ఉండటం లేదు. ఎన్నిరోజులు ఓర్చుకున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. ఆక‌లితో ఉండలేక శుక్రవారం సిల్వర్‌జూబ్లీ హాస్టల్‌ విద్యార్థినీ, విద్యార్థులు రోడ్డెక్కారు. కళాశాల నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీగా వచ్చారు. కలెక్టర్‌ బయటకు వచ్చి తమ సమస్యలు వినాలని, తమకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టరేట్‌ ఎదుట ఖాళీ ప్లేట్లతో భారీ ధర్నా నిర్వహించారు.

Education Department : విద్యారంగంలో ఉన్న స‌మ‌స్య‌ల‌పై ప‌రిష్క‌రించేందుకు ప‌లు సూచ‌న‌లు..

ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ.. సిల్వర్‌ సెట్‌ రాసి మంచి ర్యాంకుతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు కళాశాలలో చేరితే ఇక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. కళాశాల హాస్టల్‌లో 700 మంది ఉండగా.. ఇందులో 200 విద్యార్థులు, 500 మంది విద్యార్థినులు రోజూ ఆకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పురుగుల అన్నం, నీళ్ల సాంబారు, మజ్జిగ తప్ప మరో భోజనం తమకు పెట్టడం లేదన్నారు. అదేమని అడిగితే ప్రిన్సిపాల్‌, వార్డెన్‌లు సమాధానం చెప్పడం లేదన్నారు.

Posts at SVIMS University : స్విమ్స్ యూనివ‌ర్సిటీలో ఆడ్‌హాక్ బేసిస్ పద్ధ‌తిలో ఈ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు..

నిర్వహణ అస్తవ్యస్తం

డిగ్రీ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు చెల్లిస్తున్న మెస్‌చార్జీలు క్లస్టర్‌ యూనివర్సిటీ పరిధిలోకి వెళ్తున్నాయి. ఇదే సమయంలో ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థుల మెస్‌చార్జీలు మాత్రమే సిల్వర్‌జూబ్లీ కళాశాల ఖాతాలో జమ అవుతున్నాయి. ఈ క్రమంలో కళాశాల ఖాతాలో జమ అయిన మొత్తంతో విద్యార్థులు, విద్యార్థినుల హాస్టళ్లలో భోజనంతోపాటు మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ఇబ్బందిగా మారింది. కళాశాల నిర్వహణకు క్లస్టర్‌ యూనివర్సిటీ నిధులను సమకూర్చడం లేదు.

Gurukul School Inspection : గురుకుల పాఠ‌శాల‌లో క‌లెక్ట‌ర్ ఆకస్మిక త‌నిఖీ.. ఉపాధ్యాయుల‌కు సూచ‌న‌లు ఇలా!

దీంతో ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు చెల్లిస్తున్న ఫీజులతోనే మొత్తం మూడు సంవత్సరాల విద్యార్థుల హాస్టళ్ల నిర్వహణ జరగాలి. మరోవైపు ఒక్కో విద్యార్థికి మెస్‌చార్జీల కోసం నెలకు రూ.430 చెల్లిస్తారు. ఈ మొత్తంతో పెరిగిన నిత్యావసరాలు కొనుగోలు చేసి మూడు పూటలా భోజనం పెట్టేందుకు నిర్వాహకులకు ఇబ్బందిగా ఉంది. ఇందులో అధిక శాతం బియ్యం కొనుగోలుకే చెల్లించాల్సి వస్తోంది. కూరగాయలు, నూనెలు, ఇతర వస్తువులను కొను గోలు చేయడానికి డబ్బు సరిపోవడంలేదు.

Helpline for Engineering Counselling : ఇంజినీరింగ్ అడ్మిష‌న్ కౌన్సెలింగ్‌కు నిర్వ‌హించిన హెల్ప్‌లైన్ సెంట‌ర్‌కు విశేష స్పంద‌న‌!

#Tags