Polytechnic Spot Admissions : పాలిటెక్నిక్‌ స్పాట్‌ అడ్మిషన్లు.. ప్రవేశానికి తేదీ!

నెల్లూరు: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌ చదివిన విద్యార్థులు పాలిటెక్నిక్‌లో ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు సంబంధించిన స్పాట్‌ అడ్మిషన్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని నెల్లూరు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌ రామ్‌ప్రసాద్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు తమ దరఖాస్తులను ఈ నెల 16లోపు సమర్పించాలని.. ఆయా కళాశాలల్లో ప్రవేశాన్ని 18న కల్పించనున్నామని పేర్కొన్నారు. సర్టిఫికెట్ల ఒరిజినల్‌, జిరాక్స్‌ కాపీలను తీసుకురావాలని సూచించారు.

PhD Entrance Exam Ranker : పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలో ప్రథమ ర్యాంకు..

#Tags