Skills: నైపుణ్యంతో ఉపాధి అవకాశాలు

విజయనగరం అర్బన్‌: విద్యార్హతతో పాటు నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం వల్ల ఉన్నత ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని ఆంఽధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండూరు అజయ్‌రెడ్డి అన్నారు.

జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన జిల్లా కేంద్రంలో ఉన్న టీటీడీసీలోని స్కిల్‌కాలేజీ, సెంచూరియన్‌ యూనివర్సిటీలో ఉన్న నైపుణ్య శిక్షణ కేంద్రాలను గురువారం సందర్శించారు. శిక్షణ పొందుతున్న యువతతో మాట్లాడారు. నైపుణ్య శిక్షణ తీరును అడిగి తెలుసుకున్నారు. నేర్చుకున్న శిక్షణతో ఏ స్థాయిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయన్న దానిపై అభ్యర్థుల అవగాహన సామర్థ్యాలను పరీక్షించారు. శిక్షణ అనంతరం లభించే అవకాశాలను అందిపుచ్చుకోవాలని, ఉద్యోగంలో మరింత నైపుణ్యతతో ఉన్నతంగా జీవించవచ్చన్నారు. దూరప్రాంతాల్లో ఉద్యోగాలు చేసేందుకు మానసికంగా సిద్ధంకావాలని సూచించారు. రాష్ట్రంలోని యువత నైపుణ్య సంస్థ అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకుని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నదే ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అభిమతమన్నారు. కార్యక్రమంలో సీడప్‌ సీఈఓ ఎంకేవీ శ్రీనివాసులు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డాక్టర్‌ ఎన్‌.గోవిందరావు, జిల్లా సీడప్‌ జేడీ ఎం.మార్టిన్‌లూథర్‌, సెంచూరియన్‌ యూనివర్సిటీ ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌ డీన్‌ మురళి, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సిబ్బంది పాల్గొన్నారు.

చదవండి: Employment Opportunities: నిరుద్యోగ యువతులకు ఉద్యోగాలు

#Tags