Skill Hub : నిరుద్యోగులకు స్కిల్ హబ్ ఉపాధి.. ఈ కోర్సుల్లోనే శిక్షణ..
కాకినాడ సిటీ: ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక స్కిల్ హబ్ ఏర్పాటు చేశామని జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఎం.కొండలరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటి ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో నిరుద్యోగ యువతకు వివిధ కోర్సుల్లో మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చి, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా సర్టిఫికెట్ జారీ చేస్తామని వివరించారు. ఆసక్తి ఉన్న నిరుద్యోగులు స్కిల్ హబ్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరారు. కాకినాడ ప్రభుత్వ ఐటీఐలోని స్కిల్ హబ్‌లో అసిస్టెంట్ ఇన్‌స్టలేషన్ కంప్యూటింగ్, ఎలక్ట్రికల్ టెక్నీషియన్ కోర్సులలో శిక్షణ ఇస్తామన్నారు.
కాకినాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ డొమెస్టిక్ నాన్ వాయిస్, జూనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ శిక్షణ ఇస్తారని తెలిపారు. అలాగే, పిఠాపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్, అసోసియేట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ శిక్షణ ఉంటుందన్నారు. సామర్లకోట ఎన్‌ఏసీ శిక్షణ కేంద్రంలోని స్కిల్ హబ్‌లో అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆఫీసు అసిస్టెంట్, జగ్గంపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జూనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్, తుని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆఫీసు అసిస్టెంట్, వెబ్ డెవలపర్ కోర్సులలో శిక్షణ ఇస్తారని కొండలరావు వివరించారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)