Satya Rajpurohit: అక్షరశిల్పి..! అతనొక ‘అందమైన చేతిరాత’కు కేరాఫ్‌ అడ్రస్‌!

వివిధ భారతీయ భాషలకు సంబంధించి హై–క్వాలిటీ ఫాంట్స్‌ను డిజైన్‌ చేయాలనే లక్ష్యంతో అహ్మదాబాద్‌ కేంద్రంగా సత్య రాజ్‌పురోహిత్‌ ఇండియన్‌ టైప్‌ ఫౌండ్రీ (ఐటీఎఫ్‌) అనే స్టార్టప్‌కు శ్రీకారం చుట్టాడు. ఈ స్టార్టప్‌ యాపిల్, గూగుల్, అమెజాన్‌.. మొదలైన పెద్ద కంపెనీలకు భారతీయ భాషలకు సంబంధించిన ఫాంట్స్‌ డిజైన్‌ చేస్తోంది..

స్కూల్‌రోజుల్లో ‘అందమైన చేతిరాత’కు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉండేవాడు సత్య. ఫ్రెండ్స్‌ నోట్స్‌కు హైడ్‌లైన్‌ల నుంచి తరగతి గదిలోని గోడలపై నీతివాక్యాలు రాయడం వరకు అందమైన చేతిరాతకు అందరికీ  గుర్తుకు వచ్చే పేరు.. సత్య రాజ్‌పురోహిత్‌. కార్లు, బైకుల రేడియం నంబర్‌ ప్లేట్స్‌ కోసం సత్య దగ్గరికి ఎంతోమంది వచ్చేవాళ్లు. అక్షరాలను అందంగా రాసే నైపుణ్యం అతడిని ఎక్కడికో తీసుకెళ్లింది.

ఐటీఎఫ్‌(ఇండియన్‌ టైప్‌ ఫౌండ్రీ) ఒకే ఒక ఫాంట్‌ (హిందీ)తో స్టార్ట్‌ అయింది. ఆ తరువాత 450 ఫాంట్‌ల వరకు విస్తరించింది. కోహినూర్, అఖండ్, పాపిన్స్, టెకో....మొదలైన ఫాంట్స్‌ బాగా పాపులర్‌ అయ్యాయి.

‘ఐటీఎఫ్‌’ క్లయింట్స్‌లో యాపిల్, గూగుల్, అమెజాన్, సోనీలాంటి ఎన్నో పెద్ద కంపెనీలు ఉన్నాయి. థాయి, గ్రీక్, హిబ్రూ, కొరియన్‌లాంటి నాన్‌–ఇండియన్‌ లాంగ్వేజెస్‌కు సంబంధించిన ఫాంట్స్‌ను కూడా డిజైన్‌ చేస్తోంది కంపెనీ.

చదవండి: Writing Exams: సరైన సమాధానంతోపాటు చక్కని రాతకూడా ముఖ్యం

‘ప్రపంచ భాషలతో పోల్చితే భారతీయ భాషలకు ఫాంట్స్‌ క్రియేట్‌ చేయడం సవాలుతో కూడిన పని’ అంటున్న సత్య ఫాంట్స్‌ నాణ్యత విషయంలో విజయం సాధించాడు. అదే అతడి ‘యూఎస్పీ’గా మారింది. తల్లిదండ్రులు సత్యను డాక్టర్‌ చేయాలనుకున్నారు.

కోచింగ్‌ కోసం రాజస్థాన్‌లోని కోటలో రెండు సంవత్సరాలు గడిపాడు సత్య. తల్లిదండ్రుల కలను నేరవేర్చడంలో విఫలం అయ్యాడు. ఆ సమయంలోనే తనకు ఇష్టమైన ఆర్ట్‌ను కెరీర్‌గా చేసుకొని విజయం సాధించాలనుకున్నాడు. చండీగఢ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్, అహ్మదాబాద్‌లో చదువుకున్నాడు.

చదవండి: Exams 2024: పుస్తకాలు చూస్తూ పరీక్షలు రాసే విధానం..

‘కోటలో రెండు సంవత్సరాల కాలాన్ని వృథా చేసుకున్నాను. చదువులో గుడ్‌స్టూడెంట్‌ని కాదు. నాకు ఆర్ట్‌ అంటే ఇష్టం. నాకు ఇష్టమైన రంగంలో కష్టపడితే కచ్చితంగా విజయం సాధిస్తాను అనుకున్నాను’ గతాన్ని గుర్తు తెచ్చుకుంటాడు సత్య. అతడి నమ్మకం వృథా పోలేదు. సత్య పురోహిత్‌కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డ్‌లు వచ్చాయి.

- ప్రపంచంలోని లీడింగ్‌ టైప్‌ ఫౌండ్రీలలో ‘ఐటీఎఫ్‌’ ఒకటిగా గుర్తింపు పొందింది. జీక్యూ ఇండియా ‘50 మోస్ట్‌ ఇనిఫ్లూయెన్షల్‌ యంగ్‌ ఇండియన్స్‌’ జాబితాలో చోటు సాధించిన సత్య రాజ్‌ పురోహిత్‌ యువతకు ఇచ్చే సందేహం.. ‘ప్రతి ఒక్కరిలో టాలెంట్‌ ఉంటుంది. ఆ టాలెంట్‌ ఏమిటి? అనేదాని విషయంలో చాలామందికి స్పష్టత ఉండదు. తనలోని టాలెంట్‌ ఏమిటో తెలుసుకొని ఇష్టంగా కష్టపడితే విజయం సాధించడం కష్టమేమీ కాదు’

#Tags