Research Methodology: ‘రీసెర్చ్ మెథడాలజీ’తో ఉపయోగాలు
ఆయన మాట్లాడుతూ.. 7 రోజుల ఈ కోర్సును వర్సిటీలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. పరిశోధక విద్యార్థులకు దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని తెలిపారు. విశిష్ట అతిథి ఆచార్య బి.సుధాకర్ రెడ్డి హానరరీ డైరెక్టర్ ఐసీఎస్‌ఎస్‌ఆర్ సదరన్ రీజియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇనేబుల్డ్ రీసెర్చ్ ఇన్ సోషల్ సైన్సెస్ అనే అంశంపై మాట్లాడారు. పరిశోధన అంశాలపై నిర్వహించే ఇలాంటి కార్యక్రమాలకు ఐసీఎస్‌ఎస్‌ఆర్ ఆర్థికసాయం అందిస్తుందన్నారు. ఎస్‌యూ రిజిస్ట్రార్ ఆచార్య వరప్రసాద్, యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ ప్రిన్సిపాల్ హరికాంత్, కార్యక్రమ కో–కోఆర్డినేటర్ మనోహర్, కోఆర్డినేటర్ శ్రీరంగప్రసాద్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. వివిధ కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన 14 మంది ఆచార్యులు వివిధ అంశాలపై సెషన్స్ తీసుకుంటారని పేర్కొన్నారు. లెక్చరర్లు మనోజ్‌కుమార్, కృష్ణకుమార్, తిరుపతి, నరేశ్, పర్శరాములు తదితరులు పాల్గొన్నారు.