Fee Reimbursement : విద్యార్థులకు అందని ఫీజు రీయింబర్స్‌మెంట్.. ఉన్నత చదువులకు గ్రహణం!
● అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో ఉదయ్ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. గతేడాదికి సంబంధించిన మూడు టర్మ్ ఫీజులు రీయింబర్స్ కాలేదు. ఒక త్రైమాసికానికి సంబంధించి మాత్రమే ఫీజు కట్టాడు. దీంతో ఫీజు కడితేనే కళాశాలకు రావాలని యాజమాన్యం హెచ్చరించింది. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఉదయ్ తల్లిదండ్రులు అప్పు చేసి కొంత ఫీజు చెల్లించారు. నవంబర్‌లో సెమిస్టర్ పరీక్షలు జరుగుతాయి. పరీక్ష ప్రారంభంలోపే మొత్తం ఫీజు చెల్లిస్తేనే అనుమతిస్తామని షరతు విధించారు. ఈ నేపథ్యంలో ఫీజు కట్టడానికి ఇబ్బందులు పడుతున్నారు.
☛ Join our WhatsApp Channel (Click Here)
● శ్రీసత్యసాయి జిల్లా కదిరికి చెందిన రఘునాథ అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశారు. గతేడాది ఒక త్రైమాసికం ఫీజు మాత్రమే చెల్లించారు. తక్కిన మూడు త్రైమాసికాల ఫీజు చెల్లించలేదు. మూడు టర్మ్ ఫీజులు చెల్లించాల్సి ఉందని కళాశాల సిబ్బంది సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించారు. మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అయినా ఉద్యోగంలో చేరడానికి సర్టిఫికెట్ లేదు. దీంతో ఎలాగైనా ఉద్యోగంలో చేరాలని రఘునాథ అప్పు చేసి మరీ ఫీజు చెల్లించాడు. ఇప్పటిదాకా ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తం రాలేదు. అసలు ఫీజు రీయింబర్స్‌మెంట్ వస్తుందా? రాదా? తెలియని పరిస్థితి.
● ‘‘పరీక్షలు రాయాలంటే ముందు ఫీజు కట్టండి.. చివరి సంవత్సరం పాసైన వాళ్లకు సర్టిఫికెట్లు ఇవ్వాలంటే ఫీజులు మొత్తం చెల్లించాల్సిందే. మెస్, హాస్టల్ చార్జీలు కడితేనే గదులు కేటాయిస్తాం. కొత్త ప్రభుత్వం వచ్చింది. ఇక మీకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వస్తుందని ఆశ పడొద్దు.. అప్పోసప్పో చేసి తీర్చండి. లేదంటే మీ చదువులకు కచ్చితంగా ఆటంకాలు తప్పవు. ఆ తర్వాత మాది బాధ్యత కాదు..’’
DSC Free Coaching: డీఎస్సీ ఉచిత శిక్షణ దరఖాస్తు గడువు పొడిగింపు..
ఇదీ జిల్లాలో డిగ్రీ, ఇంజినీరింగ్, డిప్లొమో కాలేజీ యాజమాన్యాల బెదిరింపు ధోరణి.
అనంతపురం: పేదింటి పిల్లలు ఉన్నత విద్య చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన పథకం ‘ఫీజు రీయింబర్స్‌మెంట్’. ఇన్నాళ్లూ పథకం సజావుగా అమలైంది. ఎంతోమంది విద్యార్థులు ప్రభుత్వం అందించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఉన్నత చదువులు ఉచితంగా చదువుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ గురించి పట్టించుకోకపోవడంతో విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా తయారైంది. జిల్లాలో 40,006 మంది విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. వీరికి ప్రతి మూడు నెలలకు (త్రైమాసికానికి) రూ.29.08 కోట్ల ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదికి రూ.116.32 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని విద్యార్థులకు అందించాలి.
☛Follow our YouTube Channel (Click Here)
ఉన్నత విద్యారంగంలో కుదుపు..
ఐదేళ్ల పాటు నిశ్చింతగా ఉన్న ఉన్నత విద్యారంగంలో ఒక్కసారిగా కుదుపు మొదలైంది. ఇన్నాళ్లూ ప్రభుత్వం ఇచ్చిన భరోసాతో చదువుల్లో రాణిస్తున్న పేదింటి బిడ్డల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇంత వరకు విడుదల కాకపోవడంతో పిల్లల చదువుల పరిస్థితి గాలిలో దీపంలా మారింది. విద్యా సంవత్సరం ఇప్పటికే దాదాపు సగం పూర్తయ్యింది. మరో వైపు కోర్సులు పూర్తి చేసిన వారి చేతికి సర్టిఫికెట్లు అందాలంటే బకాయిలు చెల్లించాలని కోరడంతో ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగాలు వచ్చినా అందులో చేరలేని పరిస్థితి ఎదురవుతోంది.
తల్లిదండ్రుల్లోనూ ఆందోళన
ఇంత కాలం ప్రతి మూడు నెలలకొకసారి (త్రైమాసికం) విడుదల చేస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ (ట్యూషన్ ఫీజు) చెల్లింపులు నిలిచిపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మరో వైపు ఇంటికి దూరంగా ఉంటూ ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయంతో (వసతి దీవెన) హాస్టళ్లలో చదువుకుంటున్న విద్యార్థులపై ఒక్కసారిగా అప్పు భారం పడింది. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక వైఎస్సార్‌సీపీ హయాంలో అమలైన పథకాలకు పేర్లు మార్చిందే కానీ వాటి అమలు విస్మరించింది.
☛ Follow our Instagram Page (Click Here)
నాడు సాఫీగా ఉన్నత చదువులు
పేదింటి విద్యార్థులను అత్యున్నత ప్రమాణాలు కలిగిన కళాశాలల్లో చదివించి వారి భవిష్యత్తుకు వైఎస్ జగన్ ప్రభుత్వం బంగారు బాట వేసింది. విద్యార్థులు, కళాశాలలు ఎక్కడా ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టింది. చదువుల విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించింది. 2017 నుంచి 2019 మధ్య బకాయి పడ్డ ఫీజులను సైతం జగన్ సీఎం అయ్యాక చెల్లించారు. వీటి చెల్లింపుల్లోనూ ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం అలసత్వం వహించడంతో కళాశాలల యాజమాన్యాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. విద్యార్థుల సర్టిఫికెట్లు, హాల్ టికెట్ల కోసం అప్పులు చేసి డబ్బులు కట్టాల్సిన దుస్థితి వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పేదింట బిడ్డల విద్యను బాధ్యతగా భావించి ఆ బకాయిలను మొత్తం చెల్లించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాజకీయ కోణంలో చూస్తూ బాధ్యతను విస్మరించింది.
Tenth Public Exam Fees : పబ్లిక్ పరీక్షల ఫీజు చల్లింపుకు షెడ్యూల్ విడుదల.. ఈ తేదీలోగా!